Chief Minister: కారులో కూర్చుని సీఎం జనతా దర్శన్
ABN , First Publish Date - 2023-10-04T13:37:03+05:30 IST
ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బెంగళూరులోని తన అధికార నివాసం కృష్ణలో కారులో కూర్చుని ప్రజలనుంచి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బెంగళూరులోని తన అధికార నివాసం కృష్ణలో కారులో కూర్చుని ప్రజలనుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మంగళవారం ఉదయం బెళగావికి బయల్దేరి వెళ్ళబోతుండగా తన నివాసం వద్ద జనతాదర్శన్కోసం వందలాది మంది ప్రజలు ఎదురు చూస్తుండడాన్ని గమనించారు. పైగా వీరిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు వచ్చారని తెలుసుకున్న ఆయన కారులోనే దాదాపు అరగంటకు పైగా ప్రజల సమస్యలను ఆలకించారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బెళగావికి బయల్దేరి వెళ్ళారు.