Child Health: 18 నెలల వయసు దాటిన పిల్లలు అసలేం తినొచ్చు..? తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా..?
ABN , First Publish Date - 2023-09-14T13:04:33+05:30 IST
ఒకటిన్నర సంవత్సరం వయసు తరువాత పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఆ వయసు పిల్లలకు ఏ ఆహారం ఇస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుంది? రోజులో ఎన్నిసార్లు ఆహారం ఇవ్వాలి? వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆహారాలు ఇవ్వకపోవడం మంచిది?
పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆహారం. అది ఎంతో పోషకం కూడా. ఆ తరువాత సాధారణ పాలు, ఇతర ఆహారాలు క్రమంగా అలవాటు చేస్తారు. పిల్లలు పెరిగే కొద్ది వారి ఆహారం అప్డేట్ కావాలి. అలా అవుతుంటేనే వారికి సరిపడిన పోషకాలు అందుతాయి. 18నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరం వయసు తరువాత పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఆ వయసు పిల్లలకు ఏ ఆహారం ఇస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుంది? రోజులో ఎన్నిసార్లు ఆహారం ఇవ్వాలి? వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆహారాలు ఇవ్వకపోవడం మంచిది? పసిబిడ్డలు ఉన్న ప్రతి తల్లీ ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. వీటి గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
18నెలలు నిండిన పిల్లలకు(18months babies) రోజుకు మూడుసార్లు ఆహారం(Meals), రెండు సార్లు స్నాక్స్(snaks) ఇవ్వడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో పాలు, పాల ఉత్పత్తులు, జున్ను వంటి వాటిని రోజులో రెండుసార్లు చిన్నమొత్తంలో ఇవ్వాలి. ఇంకా సపోటా, స్ట్రాబెర్రీ, అత్తిపండు లేదా అంజీర్. ఆప్రికాట్ మొదలైనవి పిల్లలకు ఇవ్వచ్చు. అయితే మొదటిసారి వీటిని పిల్లలకు ప్రయత్నించేటప్పుడు వారి ఆరోగ్యాన్ని ప్రతినిమిషం గమనించుకుంటూ ఉండాలి. వీటివల్ల ఏదైనా అలర్జీ లాంటివి కలిగితే వెంటేనే ఆపేయాలి. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో రెండు నుండి మూడు శాతం మంది పాల వల్ల అలెర్జీలు ఎదుర్కొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
Marriage Card: నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి కార్డు.. అందులో రాసి ఉన్న పదాలను చూసి పేలుతున్న సెటైర్లు..!
18నెలల పిల్లకు రోజుకు మూడు ఔన్సుల ధ్యానాలు ఇవ్వాలి. వీటి ద్వారా పిల్లకు పోషకాలు సమృద్దిగా అందుతాయి. తక్కువ చక్కెరలు, ఎక్కువ ఫైబర్ కలిగిన తృణధాన్యాలు ఇవ్వడం ద్వారా పిల్లలో శారీరక ఎదుగుదల బాగుంటుంది. రాగులు, జొన్నలు, గోధుమలు, ఓట్స్ మొదలైన వాటిని దోరగా వేయించుకుని వాటిని పిండి పట్టి బేబీ ఫుడ్ గా ఇవ్వవచ్చు. వీటిలో రుచికోసం కాసింత ఏలకులు, జీడిపప్పు, బాదం వంటివి కూడా జోడించవచ్చు.
పిల్లలకు ప్రోటీన్ చాలా అవసరం. 18నెలల పిల్లలకు రోజుకు 56గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ ను మాంసాహారులు అయితే చేపలు, చికెన్, పాలు, గుడ్ల నుండి, శాఖాహారులు అయితే బఠానీ, సోయా, సోయా ఉత్పత్తులు, విత్తనాలు మొదలైన వాటినుండి పొందవచ్చు. కాకపోతే తక్కువ కొవ్వుతో ఉన్న ప్రోటీన్ ను పిల్లలకు ఇవ్వాలి. వీటి ద్వారా పిల్లకు అలర్జీలు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి.
పిలలకు ప్రతిరోజూ ఒకకప్పు పండ్లు, ఒక కప్పు కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటినుండి పిల్లలకు సరిపడినంత పోషకాలు సులువుగా అందుతాయి. పండ్లకు బదులుగా పండ్ల రసాలను అసలు ఇవ్వకూడదు. ఒకటిన్న సంవత్సరం బిడ్డను తల్లిపాలు, సాధారణ పాల నుండిక్రమంగా ఆహారం వైపుకు మళ్లించాలి. ఎక్కువకాలం బాటిల్ పాలు అలవాటు చేస్తే పిల్లలలో దంత క్షయం, ఐరన్ లోపం, అధికబరువు పెరగడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలకు మెల్లిగా చేత్తో ఆహారం తినడాన్ని అలవాటు చేయాలి.