Viral Video: తెలివైన బాతు.. ఆ పులిని ఎలా బోల్తా కొట్టించిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN , First Publish Date - 2023-07-09T10:18:45+05:30 IST

ప్రపంచంలో ఏ మూల కాస్త ఆసక్తికర, ఫన్నీ ఘటన జరిగినా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: తెలివైన బాతు.. ఆ పులిని ఎలా బోల్తా కొట్టించిందో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ప్రపంచంలో ఏ మూల కాస్త ఆసక్తికర, ఫన్నీ ఘటన జరిగినా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా @buitengebieden అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ ఫన్నీ వీడియో (Funny Video)ను ఇప్పటివరకు దాదాపు 1.28 కోట్ల మంది వీక్షించారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ సరస్సులో ఓ బాతు (Duck) ఈదుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆ బాతును చూసిన పులి (Tiger) తనదైన శైలిలో దానిని వేటాడేందుకు ప్రయత్నించింది. సరస్సులోకి దిగి నెమ్మదిగా బాతు వైపు వెళ్తోంది. ఆ పులిని క్రీగంట గమనించిన బాతు వెంటనే నీటి లోపలికి మునిగిపోయింది. ఎక్కడా పైకి తేలలేదు. షాకైన పులి సరస్సు చుట్టూ చూసింది. ఎక్కడా బాతు జాడ కనిపించకపోవడంతో నిరాశగా చూస్తుండిపోయింది.

SIM Cards: మీ ఆధార్ కార్డుతో మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ కార్డులు తీసుకున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చంటే..!

ఆ వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.28 కోట్ల మంది వీక్షించారు. 1.94 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``స్మార్ట్ డక్``, ``టైగర్ రియాక్షన్ నచ్చింది``, ``చాలా తెలివైన బాతు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-09T10:18:45+05:30 IST