Coconut Bondas: వామ్మో.. బోండాం.. ధర అమాంతం పెరిగిందిగా..
ABN , First Publish Date - 2023-04-26T13:13:49+05:30 IST
కొబ్బరి బోండాల(Coconut Bondas) ధరలు ఆకాశన్నంటాయి. వేసవి కావడంతో కొబ్బరి నీళ్ళకు అమాంతం డిమాండ్ పెరిగింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కొబ్బరి బోండాల(Coconut Bondas) ధరలు ఆకాశన్నంటాయి. శాసనసభ ఎన్నికల తరుణంలో వివిధ పార్టీల ర్యాలీలలో పాల్గొంటున్న కార్యకర్తలు మండుటెండలో కొబ్బరినీళ్ళతో తమ దాహార్తి తీర్చుకుంటున్నారు. పైగా వేసవి కావడంతో కొబ్బరి నీళ్ళకు అమాంతం డిమాండ్ పెరగడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెలలో ఒక్కోటి రూ.30 నుంచి 35 ధర పలికిన కొబ్బరిబొండాం ఇప్పుడు రూ.40 నుంచి రూ.50వరకు పలుకుతోంది. డిమాండ్ తగ్గట్లు కొబ్బరిబొండాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల హెక్టార్ల ప్రదేశంలో కొబ్బరితోటలను పండిస్తున్నారు. ఇందులో 15 శాతం కొబ్బరిబొండాలుగానే వినియోగిస్తారు. బెంగళూరు గ్రామీణ జిల్లాతో పాటు మండ్య, తుమకూరు, మైసూరు(Mysore) జిల్లాల్లో కొబ్బరితోటలు అధికంగా ఉన్నాయి. ఎండలు తగ్గేంతవరకు అంటే మే నెల రెండోవారం వరకు కొబ్బరి బొండాలకు డిమాండ్ ఇలాగే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.