Share News

Coconut Oil: కొబ్బరి నూనె అసలు మంచిదేనా..? చాలా మందికి తెలియని నిజాలివి..!

ABN , First Publish Date - 2023-11-28T13:35:07+05:30 IST

బరువు తగ్గడం నుండి ఎన్నో విషయాలలో కొబ్బరి నూనె తోడ్పడుతుందని అంటారు. కానీ అసలు నిజాలివీ..

Coconut Oil: కొబ్బరి నూనె అసలు మంచిదేనా..? చాలా మందికి తెలియని నిజాలివి..!

కొబ్బరికాయ పేరు చెబతే దేవుడు, కొబ్బరి నూనె పేరు చెబితే ఆరోగ్యకరమైన జుట్టు గుర్తురావడం సహజం. కొబ్బరినూనెను ఎక్కువగా కేశ సంరక్షణలో ఉపయోగిస్తారు. కానీ కేరళ. తమిళనాడు రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ కొబ్బరినూనెను వంటల్లోనూ, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. బరువు తగ్గడం నుండి ఎన్నో విషయాలలో కొబ్బరి నూనె తోడ్పడుతుందని అంటారు. కానీ కొబ్బరి నూనె గురించి ఈ వాస్తవాలు తెలిస్తే మాత్రం షాకవుతారు.

కొబ్బరినూనె(coconut oil) శాతం ఉంటాయి. ముఖ్యంగా ఇందులో 82శాతం ఆమ్లతతో కూడుకుని ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ గా పరిగణించబడుతుంది. ఇది గుండె జబ్బులు, గుండె సంబంధ అనారోగ్యాలను పెంచుతుంది. కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ ఇతర మంచి కొవ్వులకు విభిన్నంగా ఉంటుంది. ఈ కారణంగా కొబ్బరినూనె గుండె జబ్బులున్నవారికి మంచిదనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

oil1.jpg

ఇది కూడా చదవండి: Wife: ఇలాంటి భర్త నాకొద్దు.. ఈ కుటుంబంలో నేనుండలేనంటూ విడాకుల కేసు పెట్టిందో భార్య.. ఆమె చెప్పిన కారణం తెలిస్తే..!



చాలామంది కొబ్బరినూనె బరువు తగ్గడంలో సహయపడుతుందని అనుకుంటారు. కానీ టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో 120 కేలరీలు, 14గ్రాముల కొవ్వు ఉంటుంది. దీన్ని ఆహారంలో చాలా పరిమిత మోతాదులో వినియోగించినా సరే సరైన శారీరక శ్రమ లేకపోతే సులువుగా బరువు పెరుగుతారు.

oil2.jpg

ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ లాంటి ఆరోగ్యకరమైన నూనెలలో ఉండే విటమిన్-ఇ, విటమిన్-కె, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి కొబ్బరినూనెలో ఉండవు.

ఇది కూడా చదవండి: Tea: బాబోయ్.. టీ ని ఇలా కూడా తయారు చేస్తారా..? దీన్ని తాగే దమ్ము ఎవరికైనా ఉందా అంటూ నెటిజన్ల సెటైర్లు..!



మిగిలిన నూనెల కంటే కొబ్బరినూనె ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. సాధారణంగా కొబ్బరినూనె ఎక్కువరోజులు నిల్వ ఉండటానికి ఎక్కువ ఉష్టోగ్రత వద్ద వేడి చేస్తారు. దీనివల్ల నూనె వాసన కూడా బాగుంటుంది. కానీ దీని కారణంగా నూనెలో ఆరోగ్యప్రయోడనాలు లాస్ అవుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణ ప్రస్తావన వస్తే కొబ్బరినూనె అస్సలు మంచిది కాదు.

oil3.jpg

కొబ్బరినూనెను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉంటాయనడానికి గరిష్ట ఆధారాలు లేవు. గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మొదలైనవాటిలో కొబ్బరి నూనె మేలు చేస్తుందనే ఆధారాలు సరైన విధంగా లేవు.

(నోట్: ఇది ఆరోగ్య నిపుణలు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా అందించిన కథనం. ఆరోగ్యం గురించి ఏ మాత్రం సందేలున్నా వైద్యులను సంప్రదిండం మంచిది.)

ఇది కూడా చదవండి: ఈ 10 పక్షులను కొనాలంటే ఆస్తులమ్మినా చాలదు.. ఒక్కోదాని ధర ఎంతంటే..!

Updated Date - 2023-11-28T13:35:09+05:30 IST