Cool Water: ఎండ నుండి ఇంటికి రాగానే చల్లనీళ్లు గడగడా తాగేస్తున్నారా? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-19T16:39:07+05:30 IST

పనుల మీద బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాటల్ లో చల్లనీళ్ళు గడాగడా తాగేస్తుంటారు. ఇలా చేస్తే కానీ ఎండ వేడికి అలసిపోయిన ప్రాణానికి ఉపశమనం లభించదు. కానీ

Cool Water:  ఎండ నుండి ఇంటికి రాగానే చల్లనీళ్లు గడగడా తాగేస్తున్నారా? ఇన్ని సమస్యలు వస్తాయని తెలిస్తే..

చల్లనీరు(cool water) అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలం(summer)లో కూల్ డ్రింకులు(cool drink), జ్యూస్లు(juice), కౌబ్బరినీళ్ళు(coconut water)ఇతర పానీయాలు ఏమీ లేకపోయినా చల్లనీళ్ళు తాగితే తృప్తిగా అనిపిస్తుంది. పనుల మీద బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాటల్ లో చల్లనీళ్ళు గడాగడా తాగేస్తుంటారు. ఇలా చేస్తే కానీ ఎండ వేడికి అలసిపోయిన ప్రాణానికి ఉపశమనం లభించదు చాలామందికి. కానీ ఇలా చేయడం వల్ల సమస్యలు వస్తాయని తెలుసా?. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఫ్రిడ్జ్ లో ఉంచిన నీరు చెప్పలేనంత ప్రమాదం. దీని వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసుకుంటే..

మనం తీసుకునే ఆహారం ఏదైనా శరీర ఉష్టోగ్రతకు(body temperature) తగినట్టుగా ఉంటే అది జీర్ణక్రియకు(digest) సులభంగా ఉంటుంది. అదే తక్కువ ఉష్టోగ్రత ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణాశయం ఆ చల్లదనానికి తగినట్టు దాని పనితీరును సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ మీద మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ఇతర అవయవాల మీద ఒత్తిడి పడుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. మరీ ముఖ్యంగా చల్లనీరు తీసుకోగానే జీర్ణాశయంలో కొ్వ్వు పదార్థాలు గడ్డకట్టిపోతాయి. ఈ కారణంగానే పొట్ట వస్తుంది.

చల్లనీళ్ళు తాగద్దురా గొంతు నొప్పి(throat pain) వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది ఆ మాట పట్టించుకోరు. చల్లనీళ్లు గడాగడా తాగడం వల్ల గొంతు కండరాల మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. దీని వల్ల గొంతులో శ్లేష్మం ఏర్పడటం, గొంతు నొప్పి, గొంతు భాగం సున్నితంగా మారిపోవడం జరుగుతుంది.

Yellow Teeth: దంతాలు పచ్చగా ఉన్నాయా..? ఎంత ట్రై చేసినా తెల్లగా మారడం లేదా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!


చల్లనినీరు వేగంగా తాగేయడం వల్ల గుండె స్పందన రేటు(heart rate) తగ్గుతుంది. చల్లనినీరు తాగినప్పుడు పదవ కపాల నాడి(cranial nerve 10) అయిన వాగస్ నాడి(vagus cranial nerve) ఉత్తేజితమవుతుంది. ఈ నాడి ప్రభావం వల్ల గుండె స్పందన రేటు తగ్గుతుంది. నీరు తాగుతున్నప్పుడు ఒక్కోసారి గుండె పట్టేసినట్టు అవుతుంటుంది. దానిక్కారణం ఇదే..

ఎండకు అలసిపోయి వచ్చినప్పుడు దాహం తీరడం కోసం చల్లని నీరు తాగితే మెదడు స్తంబించిపోతుంది. చల్లనినీరు వెన్నెముకలో నరాలను చల్లబరుస్తాయి. ఈ కారణంగా మెదడుకు సంకేతాలు చేరకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఇది తలనొప్పి సమస్యకు దారితీస్తుంది. సైనస్ సమస్యతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.

బరువు తగ్గాలని అనుకునేవారు చల్లనీళ్లు తాగకూడదు. చల్లనీరు శరీరంలో కొవ్వులను మైనంలా మార్చేస్తుంది. ఎన్ని వర్కౌట్లు చేసినా, ఎన్ని డైట్ లు ఫాలో అయినా ఫలితం ఉండదు. చల్లనీళ్ళు అవాయిడ్ చేసి చూడండి బరువు తగ్గడంలో మ్యాజిక్ జరుగుతుంది.

AC, Cooler ఏదీ అక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. ఇల్లంతా యమా కూల్..!


Updated Date - 2023-04-19T16:39:07+05:30 IST