Cooling helmet: ట్రాఫిక్‌ పోలీసులకు కూలింగ్‌ హెల్మెట్‌

ABN , First Publish Date - 2023-09-28T10:09:21+05:30 IST

నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులకు చల్లదనాన్నిచ్చే హెల్మెట్‌, షర్ట్‌కు బటన్‌ కెమెరాను అందజేశారు. వేసవిలో ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక రకమైన

Cooling helmet: ట్రాఫిక్‌ పోలీసులకు కూలింగ్‌ హెల్మెట్‌

ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులకు చల్లదనాన్నిచ్చే హెల్మెట్‌, షర్ట్‌కు బటన్‌ కెమెరాను అందజేశారు. వేసవిలో ట్రాఫిక్‌ పోలీసులకు ప్రత్యేక రకమైన టోపీలను అందిస్తుంటారు. ప్రస్తుతం వారికి ఆంధ్ర, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌(Andhra, Gujarat, West Bengal) ప్రాంతాల్లో ఉన్నట్లు ప్లాస్టిక్‌తో రూపొందించిన బ్యాటరీతో పనిచేసే చిన్న ఫ్యాన్‌ కలిగిన హెల్మెట్లను అందిస్తున్నారు. 900 గ్రాముల బరువున్న ఈ హెల్మెట్‌ ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన కరం అనే ప్రైవేటు సంస్థ తయారుచేస్తోంది. అలాగే, హైదరాబాద్‌(Hyderabad)లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహన చోదకులకు జరిమానా విధించే పోలీసులకు షర్ట్‌కు అమర్చే కెమెరాను అందజేసిన తరహాలో చెన్నై పోలీసులకు బటన్‌ కెమెరా అందజేశారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొంతమందికి మాత్రమే వీటిని అందజేశామని, త్వరలోనే అందరికీ ఇస్తామని పోలీసు శాఖ తెలిపింది.

Updated Date - 2023-09-28T10:09:21+05:30 IST