Costly Water: హైదరాబాద్‌లో ఓ యువతికి షాకింగ్ అనుభవం.. ఒక్క వాటర్ బాటిల్ రూ.350.. నీళ్లు తాగాక ఆమె ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-07-13T16:35:08+05:30 IST

20రూపాయల వాటల్ బాటిల్ కొనడానికి 10సార్లు ఆలోచించేవాళ్లుంటారు. కానీ ఈ యువతి తనకు తెలియకుండానే 350రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. బిల్ కట్టి అక్కడి నుండి తిన్నగా వెళ్ళకుండా ..

Costly Water: హైదరాబాద్‌లో ఓ యువతికి షాకింగ్ అనుభవం.. ఒక్క వాటర్ బాటిల్ రూ.350.. నీళ్లు తాగాక ఆమె ఏం చేసిందంటే..!

ప్రయాణాలు చేసేటప్పుడు మనతో తీసుకెళ్ళిన బాటల్ లో నీరు అయిపోయినా, అసలు వాటర్ తీసుకెళ్ళడం మరిచిపోయినా తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొంటాం. అది కొనడానికి ముందూ వెనుకా ఆలోచించే పొదుపరులు చాలామందే ఉంటారు. 20రూపాయలు ఖర్చుపెట్టడానికే ఇంత కిందా మీదా అయిపోతుంటే ఓ మహిళ మాత్రం వాటర్ బాటిల్ కు ఏకంగా రూ. 350 చెల్లించింది. అది కూడా పాపం ఆమెకు తెలియకుండానే ఇరుక్కుపోయింది. హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి ఎదురైన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనే ఇలా ఉంటే..నీళ్ళు తాగిన తరువాత ఆమె చేసిన పని మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్(Hyderabad) కు చెందిన రితికా బోరా అనే యువతి న్యూట్రిషన్ కోచ్(nutrition coach) గా పనిచేస్తున్నారు. ఆమె హైదరాబాద్ లోని ఓ ఫ్యాన్సీ రెస్టారెంట్(Fancy restaurant) లో తన స్నేహితుడిని కలిసింది. వారిద్దరూ ఆ రెస్టారెంట్ లో భోజనం చేశారు. భోజనం చేసిన తరువాత బిల్ పేపర్ చూసి ఆమె అవాక్కయ్యింది. ఆ బిల్ పేపర్ లో వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ.350 చార్జ్ చేశారు. కేవలం 660మి.లీ ల బాటిల్ కు రూ.350(660ml water bottle price 350rs) ఏంటని ఆమె విస్తుపోయింది. అయితే నీరు తాగిన తరువాత బిల్ కట్టక తప్పదు కదా.. అందుకని ఆమె రెస్టారెంట్ లో బిల్ పే చేసింది. అయితే ఆమె బిల్ కట్టి అక్కడి నుండి తిన్నగా వెళ్ళకుండా ఆ వాటర్ బాటిల్ కూడా తనతో తీసుకెళ్ళిందట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేసి ఇలా జరిగిందంటూ వాపోయింది. 'మీరు కాస్ట్లీ వాటర్ కు బదులుగా నార్మల్ వాటర్ ను ఎందుకు ఆర్డర్ చేయలేదు' అని ఆమెను సోషల్ మీడియాలో ఒకరు ప్రశ్నించారు. 'నేను ఏసీ సెక్షన్ కు వెళ్ళాను. అక్కడ వాళ్లే ఆ బాటిల్ తెచ్చిపెట్టారు. అది నేను ఆర్టర్ చేయలేదు' అని ఆమె వాపోయింది.

Viral Video: సింహాన్ని చూడగానే భయపడిన గున్న ఏనుగులు.. వెంటనే పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..


ఈ విషయాన్ని సదరు మహిళ Ritika Borah అనే తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేసింది. 'ఫ్యాన్సీ రెస్టారెంట్ లో నా స్నేహితుడిని కలిసినప్పుడు వాటర్ బాటిల్ కు రూ.350 చార్జ్ చేశారు. నేను ఆ బాటల్ ను తిరిగి వాడుకోవడానికి నాతో తెచ్చుకున్నాను. ఇది నేను మాత్రమే చేశానా? లేక మీరు కూడా ఇలాగే చేస్తారా?' అని ఆమె క్యాప్షన్ మెన్షన్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చాలా మంది స్పందిస్తున్నారు. 'ఒక నెల కిందట నాకూ ఇలానే జరిగింది. నేను నా సిస్టర్ తో కలసి రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు ఇదే పర్యావసానం ఎదురైంది' అని వాపోయారు. ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్స్ నిండిపోయి ఉన్నబ్యాగ్ ఫోటోను ఇంకొకరు ట్విట్టర్ లో పంచుకున్నారు. '7ఏళ్ళ తరువాత నేను స్నేహితుడిని కలవడానికి జ్యూవెల్ ఆఫ్ నైజామ్ కు వెళ్లగా అక్కడ ఒక వాటర్ బాటిల్ ఏకంగా 700రూపాయలు చార్జ్ చేశారు. నేను నా స్నేహితుడు మా మీట్ కు జ్ఞాపకంగా చెరొకటి మాతో తీసుకొచ్చాము. ఏడు నెలల నుండి నేను బాటల్ వాడుతున్నాను. బాటల్ స్ట్రాంగ్ గా ఉంది. మంచి నాణ్యత ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

Health Tips: షాంపూలో పంచదారను కలిపి తలస్నానం చేయడమేంటని అవాక్కవుతున్నారా..? దీని వల్ల లాభాలేంటో తెలిస్తే..!


Updated Date - 2023-07-13T16:35:08+05:30 IST