Viral Video: ప్రేయసి కూర్చుంది కదా అని రెచ్చిపోయిన ప్రియుడు.. సడన్‌గా బైక్‌ను గాల్లోకి లేపాడు కానీ.. మరుక్షణమే షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-06-30T17:02:15+05:30 IST

పాపం.. ప్రియుడిని నమ్మి అతడి బైక్ ఎక్కడమే ఆమె పొరపాటైంది. వెనకాల కూర్చున్న ప్రేయసిని థ్రిల్ చేద్దామని ఆ యువకుడు చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. యువకుడు బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపడంతో ఆ యువతి వేగంగా వెళ్తున్న బైక్ మీద నుంచి జారి కింద పడిపోయింది.

Viral Video: ప్రేయసి కూర్చుంది కదా అని రెచ్చిపోయిన ప్రియుడు.. సడన్‌గా బైక్‌ను గాల్లోకి లేపాడు కానీ.. మరుక్షణమే షాకింగ్ సీన్..!

పాపం.. ప్రియుడిని నమ్మి అతడి బైక్ ఎక్కడమే ఆమె పొరపాటైంది. వెనకాల కూర్చున్న ప్రేయసిని థ్రిల్ చేద్దామని ఆ యువకుడు చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. యువకుడు బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపడంతో ఆ యువతి వేగంగా వెళ్తున్న బైక్ మీద నుంచి జారి కింద పడిపోయింది (Bike Stunt Videos). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఢిల్లీ పోలీసులు (Delhi Police) సోషల్ మీడియాలో షేర్ చేసి హెచ్చరికలు జారీ చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు, యువతి బిజీ రోడ్డు మీద బైక్‌ (Bike)పై వెళ్తున్నారు. వాహనాలను తప్పించుకుంటూ ఆ యువకుడు వేగంగా బైక్ నడుపుతున్నాడు. అతడిని గట్టిగా పట్టుకుని వెనకాల యువతి కూర్చుంది. ఆ సమయంలో యువకుడు బైక్ ముందు టైర్‌ను గాల్లోకి లేపి కొద్ది దూరం పోనిచ్చాడు. ఆ తర్వాత మరోసారి అలాంటి ప్రయత్నం చేశాడు. దీంతో వెనకాల కూర్చున్న యువతి బైక్ నుంచి జారి కింద పడిపోయింది. బైక్ నడుపుతున్న యువకుడు కూడా బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆ యువతికి గాయాలు అయినట్టు సమాచారం.

Bachelor's: ఉద్యోగాలు చేసే బ్యాచులర్స్.. మీక్కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా..? బాస్‌తో ఈ కుర్రాడి చాటింగ్ చదివితే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``వేగం థ్రిల్ కలిగిస్తుంది. కానీ, ప్రాణాలు తీస్తుంది``, ``మెసేజ్ చిన్నది. కానీ, చాలా విలువైనది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-30T17:02:15+05:30 IST