Marriage: పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు.. వివాహాన్ని రద్దు చేయండంటూ కోర్టు మెట్లెక్కిన భార్యాభర్తలు.. చివరకు..!

ABN , First Publish Date - 2023-09-20T19:15:00+05:30 IST

నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కాలం గడుస్తున్న కొద్దీ భాగస్వామితో పలు విషయాల్లో సర్దుకుపోయి సంసారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోతే విడాకులు తీసుకుని విడిపోతారు.

Marriage: పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు.. వివాహాన్ని రద్దు చేయండంటూ కోర్టు మెట్లెక్కిన భార్యాభర్తలు.. చివరకు..!

నచ్చిన వ్యక్తిని పెళ్లి (Marriage) చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. కాలం గడుస్తున్న కొద్దీ భాగస్వామితో పలు విషయాల్లో సర్దుకుపోయి సంసారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా ఇద్దరి మధ్య సమన్వయం కుదరకపోతే విడాకులు (Divorce) తీసుకుని విడిపోతారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. అయితే తాజాగా ఓ జంట పెళ్లైన మూడు నిమిషాలకు విడాకులు తీసుకుని రికార్డు సృష్టించింది (Shortest Marriage). ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయం కలిసి ఉన్న జంటగా నిలిచింది (Viral).

కువైట్‌ (Kuwait)లో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరులు బయటకు వస్తున్నారు. ఆ సమయంలో వధువు కాలు జారి కింద పడింది. వరుడు ఆమెకు సహాయం చేయకపోగా ``స్టుపిడ్`` అని తిట్టాడు. దీంతో ఆగ్రహించిన వధువు తమ వివాహాన్ని రద్దు చేయాలని న్యాయమూర్తిని కోరింది. వరుడు కూడా పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విచారించిన న్యాయమూర్తి ఆ వివాహాన్ని రద్దు చేశారు. దీంతో వివాహం తర్వాత ఆ జంట కేవలం మూడు నిమిషాలు మాత్రమే కలిసి ఉంది. ఈ వివాహం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

Viral: పాపం.. తన వెనుక పెద్ద కుట్రే జరుగుతోందని 70 ఏళ్ల ఆ వృద్ధుడు ఊహించలేకపోయాడు.. 25 ఏళ్ల అమ్మాయి పక్కా స్కెచ్‌తో..!

ఈ వివాహంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``మర్యాద లేని వివాహం మొదట్లోనే విఫలమైంది``, ``అతడిని వదిలేసి ఆమె మంచి పని చేసింది``, ``పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం ఎంతో ఉత్తమం`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు. 2019లో గుజరాత్‌కు చెందిన ఓ జంట కూడా గంటల వ్యవధిలోనే విడిపోయింది. వివాహం తర్వాత మధ్యాహ్నం భోజనం సమయంలో వివాదం తలెత్తడంతో వధూవరులు విడిపోయారు. వివాహ వేడుకల్లో ఇచ్చిపుచ్చుకున్న బహుమతులను తిరిగి ఇచ్చేశారు.

Updated Date - 2023-09-20T19:15:00+05:30 IST