Crime News: మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురు ఎక్కడా కనిపించకపోవడంతో డౌట్.. పక్కింట్లోకి వెళ్లి చూస్తే..
ABN , First Publish Date - 2023-04-09T21:42:36+05:30 IST
ఇంట్లో కూతురు కనిపించకపోతే పక్కింట్లోకి వెళ్ళి చూశాడు.. కానీ ఆమె అక్కడ..
ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేని కాలమిది. ఓ తండ్రి మధ్యాహ్న సమయంలో భోజనానికని ఇంటికి వచ్చాడు. కూతురు ఇంట్లో కనిపించలేదు. ఇంటి బయట, వీధులలో అంతా వెతికాడు ఆ పిచ్చి తండ్రి. కానీ ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. పక్కింటి మీద అతనికి అనుమానం వచ్చి, ఇంట్లోకి వెళ్ళి కూతురు కోసం వెతుకుతుండగా ఊహించని రీతిలో కూతురు కనిపించింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురి విషయంలో ఓ తండ్రికి ఎదురైన సంఘటన సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పంజాబ్(punjab) రాష్ట్రం జలంధర్(jalandhar) జిల్లా హోషియాపూర్(hoshiarpur) లో మారుమూల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఓ కూతురుంది. ఆమెకు వివాహమయ్యి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన కొడుకుతో కలసి హోషియాపూర్ లో ఓ అద్దె ఇంట్లో(rented house) నివసిస్తోంది. ఆమె తండ్రి ఏప్రిల్ 6వ తేదీన హోషియాపూర్ కు పనిమీద వచ్చాడు. అతని పని ముగియగానే మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో కూతురు ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని వెళ్ళాడు. అతను ఇంట్లోకి వెళ్ళి చూడగా కూతురు కనిపించలేదు. ఏమై ఉంటుందని ఇంటి బయట, వీధులలో కూడా వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పక్కింట్లో ఏమైనా ఉందేమోనని అతను పక్కింట్లోకి వెళ్ళి చూశాడు. పక్కింట్లో కూడా కూతురు కనిపించకపోవడంతో వెనుదిరుగుతుండగా గదిలో ఉన్న ఒక పెట్టెనుండి(box) చీరకొంగు బయటకు కనిపించింది. ఆ చీర తన కూతరుకు తను కొనిపెట్టినదేననే విషయం అతనికి గుర్తొచ్చింది. వెంటనే ఆ పెట్టె తెరచి చూడగా విగతజీవిగా కనిపించిందామె. ఆమెను చూసి బోరున విలపించాడు అతను. ఆమెను పెట్టెలో నుండి బయటకు తీయగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. శరీరం మీద దుస్తులు అస్తవ్యస్తంగా, శరీమంతా గాయాలయ్యి ఉండటంతో ఆమె మీద అత్యాచారం(rape) జరిగిందనే విషయం ఆయనకు అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు.
Viral Video: డ్రైవరన్నా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కదలకుండానే దొంగను ఎలా ఇరికించాడో మీరే చూడండి..!
పోలీసులు పక్కింటికి చెందిన రాజిందర్ కోసం గాలించగా అతను తన స్నేహితుడు కరణ్ కుమార్ తో సహా చిక్కాడు. రాజిందర్ తన ఇద్దరు స్నేహితులతో కలసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మహిళను చంపేసిన తరువాత పోలీసులకు దొరక్కుండా ఉండాలని ఆమెను ముక్కలుగా చేసి దూరంగా పారేయాలనే ఉద్దేశ్యంతో పెట్టెలో దాచిపెట్టినట్టు చెప్పారు. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మూడవ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.