Crime News: ప్రేయసితో పెళ్లి జరిగేందుకు పక్కా స్కెచ్.. పోలీసులకు ఫోన్ చేసి సీఎంనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ప్రియుడు..!

ABN , First Publish Date - 2023-04-27T16:58:44+05:30 IST

ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి సీఎంను చంపేస్తానంటూ పోలీసులకు ఫోన్ చేశాడు.. అసలు ఎందుకలా చేశావని అడిగితే.. దిమ్మతిరిగిపోయే నిజం బయటపెట్టాడు..

Crime News: ప్రేయసితో పెళ్లి జరిగేందుకు పక్కా స్కెచ్.. పోలీసులకు ఫోన్ చేసి సీఎంనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ప్రియుడు..!

ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి కుర్రాళ్లు చేసే పనులు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. కొందరు కుర్రాళ్ళు ముందూ వెనుకా ఆలోచించరు ఏదో ఒక వైపరీత్యానికి పాల్పడుతుంటారు. ఓ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. నేను సీఎం ను చంపేస్తానంటూ పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. అసలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సీఎంను చంపడమేంటని అందరూ అయోమయానికి గురవుతుండగా అసలు నిజం బయటపెట్టాడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తానంటూ వచ్చిన ఈ ఫోన్ కాల్ వెనుక జరిగిన కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్(Kanpur) లోని బేగం పూర్వా ప్రాంతంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతను రిక్షా నడుపుకుంటూ(rikshaw driver) జీవనం సాగిస్తున్నాడు. అతనికి వయసులో ఉన్న ఓ కూతురు ఉంది. ఆమెను అమీన్ అనే 19ఏళ్ల కుర్రాడు ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అమీన్ ను ప్రేమించింది. కానీ వారిద్దరి పెళ్లికి(Marriage) అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. వారిద్దరూ కలవకుండా అమ్మాయి తండ్రి అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన ప్రేయసిని కలవడానికి అమీన్ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అతని ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. అమ్మాయి తండ్రి చేస్తున్న పనులకు విసిగిపోయిన అమీన్ అమ్మాయి తండ్రి మొబైల్ ను చాకచక్యంగా దొంగిలించాడు(theft girl father phone). అనంతరం ఆయన మొబైల్ నుండి 112 నెంబర్ కు ఫోన్ చేసి సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు.

Viral Video: బస్సులు, ఆటోల కన్నా ఏడుగురు కూర్చోగలిగే ఈ వెరైటీ బైక్ చాలా బెటర్.. ఈ కుర్రాడి క్రియేటివిటీకి సలాం కొడుతున్న నెటిజన్లు..!


మొబైల్ నెంబర్ రిజిష్టర్ అయిన పేరు(mobile registered name) ఆధారంగా రిక్షా నడిపే వ్యక్తిని పట్టుకున్నారు. అయితే తన మొబైల్ పోయిందని, ఎవరో దొంగిలించారని అమ్మాయి తండ్రి చెప్పడంతో మళ్ళీ వెతుకులాట మొదలుపెట్టారు. చివరికి అమీన్ ను పోలీసులు పట్టుకుని విచారించగా.. పెళ్ళికి అడ్డు చెబుతున్నాడనే కారణంతో తనే అమ్మాయి తండ్రి మొబైల్ దొంగిలించానని అతను ఒప్పుకున్నాడు. అమ్మాయి తండ్రిని అడ్డు తొలగించుకోవాలనే కారణంతోనే సీఎంను చంపేస్తానని బెదిరించానని చెప్పాడు. అమీన్ ను అరెస్ట్ చేసి అతనిమీద మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరుచనున్నట్టు తెలిపారు.

Viral News: అద్దాలను మాత్రం వదిలేశాడా డాక్టర్.. కారు మొత్తాన్ని ఆవు పేడను పూసేశాడు.. ఎందుకీ పని అని ఆ డాక్టర్‌ను అడిగితే..


Updated Date - 2023-04-27T16:58:44+05:30 IST