Curd: మట్టి పాత్రలోనే పెరుగును తోడు పెట్టమని చెప్పేది ఇందుకే.. నూటికి 99 శాతం మందికి తెలియని 5 నిజాలివీ..!

ABN , First Publish Date - 2023-07-25T15:39:45+05:30 IST

పెరుగును మట్టి పాత్రలో తోడు పెట్టాలి. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు.

Curd: మట్టి పాత్రలోనే పెరుగును తోడు పెట్టమని చెప్పేది ఇందుకే.. నూటికి 99 శాతం మందికి తెలియని 5 నిజాలివీ..!

ఎంత మంచి భోజనం తిన్నా చివరగా పెరుగుతో తినకపోతే తృప్తిగా అనిపించదు. భారతీయ భోజనంలో పెరుగుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెరుగు లేకుండా భోజనం ఉండదు. ప్రతి ఇంట్లో పాలు, పెరుగు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పెరుగు కొన్ని ఇళ్ళలో ప్యాకెట్స్ తెచ్చుకుని వినియోగిస్తే,మరికొందరు ఇంట్లో తోడు పెట్టుకుని వాడుకుంటారు. సాధారణంగా పెరుగును స్టీల్ గిన్నెలు, గ్లాసులలో తోడు పెడుతుంటారు. కానీ ఇవన్నీ వేస్ట్ అంటున్నారు ఆహార నిపుణులు. పెరుగును మట్టి పాత్రలో తోడు పెట్టాలి. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పెరుగు మట్టిపాత్రలో తోడు పెట్టడం వల్ల కలిగే 5అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

మట్టిపాత్రలు (Earthen vessels)ప్రకృతిలో భాగంగా పరిగణించబడతాయి. ఈ పాత్రలలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. మట్టి పాత్రలో పెరుగు తోడు పెట్టడం వల్ల ఈ ఖనిజాలు పెరుగులో చేరి మరింత పోషకంగా మారుతుంది.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి. ఇతర పాత్రలలో తోడు పెట్టిన పెరుగు కంటే మట్టి పాత్రలో తోడు పెట్టిన పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి(high probiotics levels).

Income Tax Return: ఐటీ రిటర్న్‌లకు ఇంకా 6 రోజులే గడువు.. జూలై 31 లోపు నమోదు చేయలేకపోతే.. జరిగేది ఇదే..!


మట్టి పాత్రలో తోడు పెట్టడం వల్ల పెరుగు ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. వేరే ఇతర పాత్రలలో ఇలాంటి తాజాదనం లభించదు. కేవలం తాజాగా ఉండటమే కాదు, మట్టిపాత్రలో పెరుగు రుచిగా కూడా ఉంటుంది(fresh and taste).

పాలు, పాల ఉత్పత్తులలో ఆమ్ల స్వభావం ఉంటుంది. మట్టిపాత్రలో పెరుగు తోడు పెట్టడం వల్ల ఈ ఆమ్లస్వభావాన్ని సమతుల్యం చేసే ఆల్కలీన్ ప్రత్యామ్నాయాలు ఇందులో ఏర్పడతాయి. ఈ కారణంగా మట్టికుండ పెరుగులో ఆమ్ల స్వభావం తగ్గుతుంది.

స్టీలు, ఇతర పాత్రలలో పెరుగు తోడు పెట్టినప్పుడు పెరుగు మీద నీరు ఏర్పడుతుంది. కానీ మట్టికుండలో పెరుగు తోడు పెట్టడం వల్ల కుండలో ఉన్న పోరస్ పొర తేమను పీల్చుకుంటుంది. తద్వారా పెరుగు గట్టిగా,క్రీమ్ లాగా తయారవుతుంది.

PhonePe: ఫోన్‌పే యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్..!


Updated Date - 2023-07-25T15:39:45+05:30 IST