Curry Leaves: పొద్దున్నే నాలుగు కరివేపాకు రెమ్మలను పరగడుపున నమిలితే.. ఆ సమస్య అసలు రానే రాదు..!
ABN , First Publish Date - 2023-12-01T12:30:07+05:30 IST
కరివేపాకులు ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. కానీ ఉదయాన్నేపచ్చి ఆకులు నమిలి తింటే...
కరివేపాకు ఖచ్చితంగా పోపులో ఉండాల్సిందే.. లేకపోతే కూర రుచిగా ఉండదు. సువాసన తగ్గినట్టు అనిపిస్తుంది. కొందరు కరివేపాకుతో పచ్చడి, కారప్పొడి, రైస్ వంటి వెరైటీలు చేసుకుని తింటారు. అయితే ఇవన్నీ కాదు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మల కరివేపాకు నమిలి తింటే మ్యాజిక్ జరుగుతుంది. అసలు కరివేపాకులో ఉండే పోషకాలు ఏంటి? వీటిని ఉదయాన్నే తినడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసుకుంటే..
కరివేపాకులో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, విటమిన్-బి2 పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకులు తింటే ఆరోగ్య లాభాలు మెండుగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఈ 8 కూరగాయలను.. ఇంట్లో ఉండే గార్డెన్‌లోనూ పెంచొచ్చు..!
చాలామందికి ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంటుంది. దీనివల్ల పనులు చురుగ్గా మొదలుపెట్టలేరు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకులు నమిలి తింటే ఈ మార్నింగ్ సిక్ నెస్(Morning sickness) సమస్య ఇక రానే రాదు.
కరివేపాకులో జీర్ణ ఎంజైమ్ లు మెండుగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ బాగా జరిగి, మలబద్దకం సమస్య దూరమవుతుంది. గ్యాస్, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతాయి.
ఉదయాన్నే కరివేపాకులు తింటే శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో, రక్తంలో పేరుకున్న టాక్సిన్స్ ను బయటకు పంపడంలో ఇవి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి.
అందమైన నల్లని జుట్టు కావాలంటే కరివేపాకు వాడాలి. నూనెలలోనూ, హెయిర్ ప్యాక్ లానూ వినియోగించడం కంటే కరివేపాకులను నమిలి తింటేనే మంచి ఫలితాలుంటాయి. వీటిలో ఉన్న ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
(గమనిక: ఈ సమాచారం ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న విషయాల ఆధారంగా పొందుపరచబడింది. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)