Curry leaves: కరివేపాకులతో మీకు తెలియని లాభాలెన్నో.. కూరల్లో కాకుండా ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..!
ABN , First Publish Date - 2023-10-09T13:02:33+05:30 IST
కరివేపాకును కూరల్లో తీసి పక్కన పెడితే పెట్టారు కానీ జుట్టుకు మాత్రం ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు.
భోజనం చేసేటప్పుడు కూరల్లో కరివేపాకు వస్తే చాలాంమంది వాటిని పక్కన పెట్టేస్తారు. మరికొందరు దాని ప్రయోజనాలు పొందడానికి కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, కరివేపాకు రైస్ వంటివి తయారుచేసుకుని వాడుతుంటారు. ఇవన్నీ ఆహారంలో భాగంగా తీసుకునేవి. ఇక జుట్టు సంరక్షణలోనూ కరివేపాకు బాగా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చాలామంది కరివేపాకును కొబ్బరినూనెలో వేసి వేడి చేసి వడగట్టి వాడుతారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. జుట్టుకు హాని కలిగించే ఫ్రీరాడికల్స్ తో ఇవి పోరాడతాయి. జుట్టు కుదుళ్ళకు మేలుచేసే విటమిన్-బి కరివేపాకులో ఉంటుంది. చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోవడం, జుట్టు రాలడం, పలుచగా ఉన్న జుట్టును మందంగా చేయడం, చుండ్రు తగ్గించడం వంటి వాటికి కరివేపాకు(curry leaves for hair health) అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫలితాలు అన్ని కలగాలంటే కరివేపాకును ఈ కిందివిధంగా ఉపయోగించాలి.
హెయిర్ ఫాల్(hair fall) ఎక్కువగా ఉన్నవారు కరివేపాకు నూనె(curry leaf oil) ఉపయోగించవచ్చు. గుప్పెడు కరివేపాకులు మెత్తని పేస్ట్ లా చేసి దాన్ని కప్పు కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. ఈ నూనెను తలకు మసాజ్ చేసి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.
Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!
చుండ్రు(dandruff) సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఎన్ని షాంపూలు వాడినా కనిపించని ఫలితం కరివేపాకు మాస్క్(curry leaf hair mask) తో పొందగలుగుతారు. కరివేపాకు పేస్ట్, పెరుగు రెండూ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టేలాగా అప్లై చేయాలి. అరగంట నుండి గంట సేపు ఉండి తలస్నానం చేయాలి. ఇది చుండ్రు తొలగించడమే కాదు జుట్టును స్మూత్ గా మారుస్తుంది.
జుట్టు పలుచగా ఉన్నవారు కరివేపాకును ఉసిరికాయతో(curry leaves, gooseberry mask) కలిపి ఉపయోగించవచ్చు. ఉసిరికాయ ముక్కలు, కరివేపాకు రెండూ కలిపి మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి ఒకటిన్నర గంటపాటు ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇది వెంట్రుక మందాన్ని(hair volume) ఊహించని విధంగా పెంచుతుంది.
జుట్టు చిట్లిపోతే దాని పెరుగుదల, జుట్టు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదు. పొడిబారిన లేదా చిట్లిన జుట్టు ఆరోగ్యంగా మారడానికి గుప్పెడు కరివేపాకును నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి స్ప్రే బాటిల్ లో వేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు స్ప్రే చేయాలి(curry leaf spray). దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. చిట్లడం తగ్గిపోతుంది.