Emotional Video: నాన్నకు ఖరీదైన ఉంగరం బహుమతిగా ఇచ్చిన కూతురు.. ఆ తండ్రి రియాక్షన్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-09-18T18:13:23+05:30 IST
ఈ ప్రపంచంలో తల్లి కంటే గొప్పగా ప్రేమించేవారు, నాన్న కంటే గొప్పగా సంరక్షించే వారు మరొకరు ఉండరని అంటుంటారు. జీవితంలో ఎవరు ఎంత దూరం వెళ్లినా వారి విజయం వెనుక వారి తల్లిదండ్రుల త్యాగం ఉందని మర్చిపోకూడదంటుంటారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగం అంతా ఇంతా కాదు.
ఈ ప్రపంచంలో తల్లి (Mother) కంటే గొప్పగా ప్రేమించేవారు, నాన్న (Father) కంటే గొప్పగా సంరక్షించే వారు మరొకరు ఉండరని అంటుంటారు. జీవితంలో ఎవరు ఎంత దూరం వెళ్లినా వారి విజయం వెనుక వారి తల్లిదండ్రుల (Parents) త్యాగం ఉందని మర్చిపోకూడదంటుంటారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగం అంతా ఇంతా కాదు. అంత చేసినా వారు తిరిగి పిల్లల నుంచి ఏమీ ఆశించరు. అలాంటి తల్లిదండ్రులకు ఏం ఇచ్చినా రుణం తీరదు. పిల్లల విజయమే తల్లిదండ్రులకు కావాల్సింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Emotional Video) సాక్షి మిశ్రా అనే యువతి తన తండ్రికి ఖరీదైన ఉంగరం (Gold Ring) బహుమతిగా ఇచ్చింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసి ఎమోషనల్ కామెంట్ చేసింది. ``అమ్మానాన్నలు ఎప్పుడూ మన విజయం కోసమే ఎదురు చూస్తారు. నీలాంటి మద్దతిచ్చే, ప్రేమించి తండ్రి దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నువ్వే నా బలం. నీ మార్గదర్శనం వల్లే నేను ఎంతో సాధించాన``ని సాక్షి పేర్కొంది. ఈ రీల్‌ను ఎడిట్ చేస్తున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కామెంట్ చేసింది.
Viral Video: ముంబైలో మహిళా ఉద్యోగుల కష్టాలు చూశారా? కదులుతున్న ట్రైన్‌లోకి ఎలా ఎక్కుతున్నారో.. వీడియోపై ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 77 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేస్తున్నారు. ``మీ నాన్న మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నారు``, ``మీర ఖరీదైన ఉంగరం కొనిచ్చే స్థాయికి ఎదిగినందుకు ఆయన సంతోషడుతున్నారు``, ``ప్రౌడ్ ఫాదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.