Share News

Cab Driver: ఈ క్యాబ్ డ్రైవర్ మామూలోడు కాదు.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా కారులోనే ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..

ABN , First Publish Date - 2023-11-26T20:42:35+05:30 IST

మీరు ఎప్పుడైనా క్యాబ్ బుక్ చేసుకుని అందులో ప్రయాణించారా? సాధారణంగా క్యాబ్ ఎలా ఉండాలి అనుకుంటాం. సీట్లు బాగుండాలని, ఏసీ మంచి కండిషన్లో ఉండాలని, మంచి డ్రైవర్ కావాలని కోరుకుంటాం. అంతకు మించి ఓ క్యాబ్‌ నుంచి ఇంకేమీ ఆశించం.

Cab Driver: ఈ క్యాబ్ డ్రైవర్ మామూలోడు కాదు.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా కారులోనే ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..

మీరు ఎప్పుడైనా క్యాబ్ (Cab) బుక్ చేసుకుని అందులో ప్రయాణించారా? సాధారణంగా క్యాబ్ ఎలా ఉండాలి అనుకుంటాం. సీట్లు బాగుండాలని, ఏసీ మంచి కండిషన్లో ఉండాలని, మంచి డ్రైవర్ కావాలని కోరుకుంటాం. అంతకు మించి ఓ క్యాబ్‌ నుంచి ఇంకేమీ ఆశించం. అయితే ఢిల్లీలోని ఓ క్యాబ్ (Delhi Cab Driver) గురించి తెలిస్తే మాత్రం ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనుకుంటారు. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ అందించే సౌకర్యాలు అలాంటివి మరి (Viral News).

ఢిల్లీలో క్యాబ్ నడుపుతున్న ఆ డ్రైవర్ పేరు అబ్దుల్ ఖాదిర్. అతని క్యాబ్‌లో ప్రయాణించిన వారు ఆ రైడ్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఖాదిర్ క్యాబ్‌లో వై-ఫైతో పాటు స్నాక్స్, జ్యూస్‌లు, వాటర్ బాటిల్, డస్ట్‌బిన్, గొడుగు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఒకవేళ మీ షూ పాలిష్ చేసి లేనట్టయితే ఆ కారులోనే మీరు మీ షూను పాలిష్ కూడా చేసుకోవచ్చు. అన్నింటి కంటే విశేషమేమిటంటే ఈ సౌకర్యాలన్నింటినీ మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు. 48 ఏళ్ల అబ్దుల్ ఖాదిర్ తన ప్రయాణికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.

Diabetes: మీకు షుగర్ ఉందా? అయితే ఈ 6 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లొద్దు..!

ఖాదిర్ అందిస్తున్న సౌకర్యాలు చూసి తోటి క్యాబ్ డ్రైవర్లు గతంలో పలుసార్లు హెచ్చరించారట. తక్షణమే అలాంటివి ఆపెయ్యాలని బెదిరించారట. అయినప్పటికీ ఖాదిర్‌ ఎవరి మాటా వినలేదు. ప్రయాణీకులకు మంచి అనుభవాన్ని అందించడానికి అడుగు ముందుకే వేశాడు. క్యాబ్‌లో ఇన్ని సౌకర్యాలు కల్పించడం చూసి చాలా మంది ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారని, అవన్నీ ఉచితంగానే అని తెలిసి మరింత షాక్ అవుతారని అబ్దుల్ చెప్పారు.

Updated Date - 2023-11-27T11:54:21+05:30 IST