Viral Video: సీఎం చేతికి సీసీటీవీ ఫుటేజీ.. బస్టాప్‌లో ముగ్గురు మహిళలు.. బస్సు ఎక్కేందుకు పరుగెత్తుకుంటూ వస్తోంటే..

ABN , First Publish Date - 2023-05-19T14:41:18+05:30 IST

ఎప్పుడు విన్న ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉంది. అంటూ వార్తలు వింటుంటాం. లాభాలు రావడం లేదు అంటూ అధికారులు

Viral Video: సీఎం చేతికి సీసీటీవీ ఫుటేజీ.. బస్టాప్‌లో ముగ్గురు మహిళలు.. బస్సు ఎక్కేందుకు పరుగెత్తుకుంటూ వస్తోంటే..
video

ఎప్పుడు విన్న ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉంది. అంటూ వార్తలు వింటుంటాం. లాభాలు రావడం లేదు అంటూ అధికారులు ప్రకటించడం వార్తల్లో చూస్తుంటాం. కానీ ప్రైవేటు బస్సులు నడిపే యజమానులు మాత్రం భారీగా లాభాలు అర్జిస్తుంటారు. మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా వర్థిల్లుతుంటారు. ఒక్క ఆర్టీసీ సంస్థ మాత్రమే ఎప్పుడు చూసినా నష్టాలే వస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇదంతా ఎందుకంటారా? ఈ సీన్ చూశాక మీకే అర్థమవుతుంది.

అసలే ఎండకాలం.. ఇంట్లో నుంచీ బయట అడుగుపెట్టాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితి. ఉదయం నుంచే ఎండలు అంతలా మండిపోతున్నాయి. ఉదయిస్తూనే భానుడు సుర్రుమంటున్నాడు. ఈ ఏడాది ఓ రేంజ్‌లో ఉష్ణోగ్రతలు టాప్ లేపుతున్నాయి. అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఓ ముగ్గురు మహిళలు మిట్ట మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు కోసం బస్టాప్‌లో (bus stop) నిలబడి ఎదురుచూస్తున్నారు. ఇంతలో రానే వచ్చింది బస్సు. కానీ ఆ డ్రైవర్ కనీసం మానవత్వం లేకుండా రన్నింగ్‌లో దిగిన ఓ ప్యాసింజర్‌ను దించేసి వెంటనే వెళ్లిపోయాడు. అయినా కూడా ఆ మహిళలు పరుగెత్తుకుని ఎక్కేందుకు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. బస్సులోకి ఎక్కించుకోలేనంత జనం ఉన్నారంటే అదీ లేదు. బస్సు ఖాళీగానే కనిపిస్తోంది. అయినా ఆపకుండా బస్సు వెళ్లిపోవడంతో ఆ ఎండలో తలపై చున్నీలు కప్పుకుని ఇబ్బంది పడుతూ నిరాశతో వెనుదిరిగారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో (Viral Video) హల్‌చల్ చేస్తున్నాయి.

dkdkd.gif

ఢిల్లీ (Delhi) లోని ఓ బస్టాప్‌లో నిలిచి ఉన్న మహిళా ప్రయాణీకులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన బస్సు డ్రైవర్ తీరుపై కేజ్రీవాల్ ప్రభుత్వం (Delhi govt) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఉద్యోగంలోంచి సస్పెండ్ (bus driver suspends) చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీడియోలో రికార్డయిన దృశ్యాలు చూస్తే.. ముగ్గురు మహిళలు ఓ బస్టాప్‌లో వేచి చూస్తున్నారు. బస్సులోని ఓ ప్రయాణికుడిని దించేందుకు బస్సును స్లో చేశాడు.. దిగగానే డ్రైవర్ వెంటనే పోనిచ్చాడు. అక్కడే వేచి చూస్తున్న మహిళలు బస్సు వెనుక పరుగులు పెడుతున్నా ఎక్కించుకోకుండానే వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఓ క్యాబ్ డ్రైవర్‌ వారిని ఎక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజువల్‌లో కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొందరు డ్రైవర్లు.. మహిళా ప్రయాణీకుల కోసం బస్సు ఆపడంలేదని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Marriage: వధువు మెడలో తాళి కట్టబోతుండగా బిగ్ షాక్.. సడన్‌గా వేదికపైకి ఓ కుర్రాడి ఎంట్రీ.. వరుడిని పక్కకు నెట్టేసి మరీ..!

Updated Date - 2023-05-19T14:46:15+05:30 IST