Viral Video: టెర్రస్‌పై బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న కూతురు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-02-16T12:18:23+05:30 IST
ఓ తల్లికూతరుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే (Valentine’s Day) నాడు జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో అది.
Viral Video: ఓ తల్లికూతరుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే (Valentine’s Day) నాడు జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో అది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఓ మహిళ ఓ యువకుడిని పట్టుకుని చితకబాదడం మనం వీడియోలో చూడొచ్చు. అయితే, ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె కూతురు బాయ్‌ఫ్రెండ్ (Boyfriend). ప్రేమికుల రోజు వారిద్దరూ కలిసి ఇంటి టెర్రస్‌పై సీక్రెట్‌గా కలుసుకున్నారు. కానీ, ఎప్పటి నుంచో కూతురిపై అనుమానం ఉన్న తల్లి.. ఆమెకు తెలికుండా ఫాలో అయ్యింది. ఆ విషయం తెలియని కూతురు ఎప్పటిలానే తన లవర్‌ను కలుసుకునేందుకు టెర్రస్‌పైకి వెళ్లింది. అలా వారిద్దరూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత యువకుడిని పట్టుకుని చితకబాదింది. అతడు ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ తర్వాత అక్కడే ఉన్న కూతురును కూడా ఆమె కొట్టడం వీడియోలో ఉంది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ "అంటీ.. కూతురి వాలైంటెన్స్ డే ప్లాన్‌పై నీరు చల్లేసిందిగా" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. అంతే.. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది (Viral Video). 3.75లక్షలకు పైగా మంది దీన్ని వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "అంటీ వెంటనే కూతురికి పెళ్లి చేసేయాలి" అని ఒకరు, "ఇది అక్షరాలా భయంకరమైనది... ఏకాభిప్రాయ సంబంధంలో ఉన్న మీ పిల్లలను కొట్టడం వల్ల జరిగే మంచి ఏంటి" అని మరోకరు, "ఇది చూడటానికి చాలా కలత కలిగిస్తుంది. అలాగే వారికి భయంకరమైన జ్ఞాపకాలను మిగిలిస్తుంది. ఇది హింస మరియు దాని నుండి కోలుకోవడం సులభం కాదు" ఇంకో యూజర్ కామెంట్ చేశారు. కాగా, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: ఇదేందయ్య ఇది.. రెస్టారెంట్‌కి వెళ్తే రుచికరమైన భోజనం కదా పెట్టాలి.. మరీ ఇలానా..!