Pet Grooming: మీ ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా.. అయితే కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది..

ABN , First Publish Date - 2023-01-31T20:57:52+05:30 IST

కుక్కల గ్రూమింగ్ కోసం మొబైల్ వ్యాన్ ప్రారంభం. నగర ప్రజలకు అందుబాటు ధరల్లోనే అన్ని రకాల సౌకర్యాలను అందిస్తామంటున్న సంస్థ.

Pet Grooming: మీ ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా.. అయితే కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం పెంపుడు కుక్కలను(Pet dogs) పెంచుకునేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ.. శునకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికీ ప్రజల్లో అవగాహన తక్కువే. కుక్కే కదా అనుకుని మనం తినే ఆహారాన్ని పెట్టేస్తుంటారు కొందరు. అంతేకాదు.. వాటి పరిశుభ్రత విషయంలోనూ అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. దీని వల్ల కుక్కలను పెంచుకునే వారికీ ఇబ్బందే. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ప్రబలితే సమస్యలు తప్పవు. అందుకే పెట్ పేరెంట్స్(Pet Parents-పెంపుడు శునకాలు ఉన్నవారు) కచ్చితంగా గ్రూమింగ్(Grooming) గురించి తెలుసుకోవాలి. అంటే.. వాటి శుభ్రతపై అవగాహన పెంచుకోవాలి.

ఈ విషయంలో పెట్ పేరెంట్స్‌కు సాయంగా.. పెట్‌ఫోక్(Petfolk) సంస్థ మొబైల్ గ్రూమింగ్ వ్యాన్‌ను ప్రారంభించింది. శునకాల గ్రూమింగ్ కోసం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా వ్యాన్‌ను తీర్చి దిద్దామని సంస్థ నిర్వహకులు తెలిపారు. ముఖ్యంగా వ్యాన్‌లో ఎలా గ్రూమింగ్ నిర్వహిస్తున్నదీ బయటఅమర్చిన ఎల్‌సీడీ స్క్రీన్లలో చూడొచ్చని వివరించారు. దీంతో.. పెట్ పేరెంట్స్‌కు తమ కుక్క ఎలా ఉందోనన్న టెన్షన్ ఉండదని వివరించారు. అంతేకాకుండా.. వ్యాన్‌లో ఏసీ ఉండటంతో మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పరిశుభ్రతకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని, ఓ కుక్క కోసం వాడిన వస్తువులను మరో శునకం కోసం వాడమని హామీ ఇచ్చారు. వ్యాన్‌లో గ్రూమింగ్ చేసే సిబ్బంది సుశిక్షితులని, దేశంలోని వివధ ప్రాంతాల నుంచి వారిని రప్పించామని వివరించారు. కుక్కకు స్నానాలు చేయించేందుకు గోరువెచ్చని నీటినే వాడతామని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T16:10:03+05:30 IST