Emergency: అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన అంబులెన్స్‎ను ఓ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..!

ABN , First Publish Date - 2023-02-28T08:57:09+05:30 IST

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‎కు కాల్ చేస్తాం. అంబులెన్స్ సమయానికి రాకపోతే..ఎంతో మంది ప్రాణాలు కొల్పోయిన వారు

Emergency: అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన అంబులెన్స్‎ను ఓ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..!

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‎కు కాల్ చేస్తాం. అంబులెన్స్ సమయానికి రాకపోతే..ఎంతో మంది ప్రాణాలు కొల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇంకొన్ని చోట్లయితే..అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మృతదేహాలను భుజానా వేసుకుని కాలినడకన వెళ్లే వారిని చూశాం. సాధారణంగా ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించాల్సిన అంబులెన్స్ ఇప్పుడు చెప్పుల రవాణాకు ఉపయోగపడింది. అంబులెన్స్ లో చెప్పులను ట్రాన్స్ పోర్ట్ చేస్తూ.. ఓ డ్రైవర్ చర్చనీయాంశంగా మారాడు. అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన అంబులెన్స్‎ను ఓ డ్రైవర్ బయట పనులకు ఉపయోగించాడు. ఈ ఘటన రాజస్థాన్‎లో చోటు చేసుకుంది. దౌసా ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న వ్యక్తి.. జైపూర్ నుంచి దౌసాకు అంబులెన్స్‎లో చెప్పులు, బూట్లను రవాణా చేశాడు.

అయితే..అతడిని కొందరు ఫాలో అయ్యి..అంబులెన్స్ సొంత పనులకు వాడుకోవడాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో రాజస్థాన్ అధికారులు ఈ విషయంపై స్పందించారు. అంబులెన్స్ డ్రైవర్‎ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఒక ఎన్జీవో ద్వారా ఈ డ్రైవర్‎ను నియమించామని, అంబులెన్స్‎లో చెప్పుల రవాణా చేస్తున్న విషయం తమకు తెలియలేదని దౌసా ప్రభుత్వాస్పత్రి ప్రిన్సిపాల్ ఆఫీసర్ శివరామ్ మీనా చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. కమిటి రిపోర్ట్ ఆధారంగా.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2023-02-28T11:47:31+05:30 IST