Share News

Viral Video: మీరు అప్పడాలు ఇష్టంగా తింటారా? అప్పడాలను ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-11-04T19:17:23+05:30 IST

ఏ పెళ్లి జరిగినా, ఫంక్షన్ జరిగినా, హోటల్‌కు వెళ్లినా భోజనంలో అప్పడాలను వడ్డించడం అనేది సర్వ సాధారణం. కొంత మంది ఇళ్లలో కూడా అప్పడాలను వేయించుకుని తింటారు. గతంలో అప్పడాలను బామ్మలు, అమ్మమ్మలు ఇళ్లలోనే తయారు చేసేవారు.

Viral Video: మీరు అప్పడాలు ఇష్టంగా తింటారా? అప్పడాలను ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి.. వీడియో వైరల్!

ఏ పెళ్లి జరిగినా, ఫంక్షన్ జరిగినా, హోటల్‌కు వెళ్లినా భోజనంలో అప్పడాలను (Papads) వడ్డించడం అనేది సర్వ సాధారణం. కొంత మంది ఇళ్లలో కూడా అప్పడాలను వేయించుకుని తింటారు. గతంలో అప్పడాలను బామ్మలు, అమ్మమ్మలు ఇళ్లలోనే తయారు చేసేవారు. తర్వాత తర్వాత వాటిని దుకాణంలో కొని తెచ్చుకుని వెయించుకోవడం మొదలైంది. మరి, అప్పడాలను భారీ స్థాయిలో ఎలా తయారు చేస్తారో తెలుసా (Making of Papads)? అప్పడాలను తయారు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

bombayfoodie_tales అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ముంబై (Mumbai)లోని ఓ ఫుడ్ ఫ్యాక్టరీలో మెషిన్ల సహాయంతో భారీ సంఖ్యలో అప్పడాలను తయారు చేస్తున్నారు. హై-టెక్ డ్రైయింగ్ ఛాంబర్‌లతో, ఫ్యాన్సీ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్‌ల ద్వారా అప్పడాలను సరైన ఆకృతిలో తయారు చేస్తున్నారు. ప్యాకింగ్ చేయడం, సీల్ చేయడం వరకు అన్నీ మెషిన్ల ద్వారానే జరుగుతున్నాయి. మెషిన్లు చాలా వరకు పరిశుభ్రంగానే ఉన్నాయి (Food and Health).

Husband: భార్య పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. భార్య బండారం బయటపెట్టిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే..

అక్కడ పని చేసే వర్కర్లు మాత్రం ఒట్టి చేతులతోనే పిండి కలపడం, ఇతర పనులు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``పాపడ్‌లు భోజనానికి మంచి రుచిని అందిస్తాయి``, ``వర్కర్లు గ్లౌస్ వేసుకుంటే బాగుణ్ను`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-04T21:03:51+05:30 IST