Viral Video: ఈ డాక్టరమ్మను ఆ తల్లి జీవితాంతం మర్చిపోదు.. పుట్టగానే బిడ్డలో ఏమాత్రం చలనం లేకపోతే.. ఏం చేసి బతికించిందంటే..!
ABN , First Publish Date - 2023-10-28T12:41:51+05:30 IST
వైద్యుడిని భగవంతుని స్వరూపం అంటారు. ఎందుకంటే దేవుడి తర్వాత మనిషి ప్రాణాలను కాపాడేది వైద్యులే. అందుకే పెద్దలు కూడా అన్నారు కదా.. 'వైద్యో నారాయణ హరి' అని. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు.
Viral Video: వైద్యుడిని భగవంతుని స్వరూపం అంటారు. ఎందుకంటే దేవుడి తర్వాత మనిషి ప్రాణాలను కాపాడేది వైద్యులే. అందుకే పెద్దలు కూడా అన్నారు కదా.. 'వైద్యో నారాయణ హరి' అని. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఈ నానుడిని నిజం చేస్తూ తాజాగా జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులో ఎలాంటి చలనం లేదు. దాంతో ఓ వైద్యురాలు ఆ శిశువుకు వెంటనే సీపీఆర్ (CPR) చేసింది. వైద్యురాలు తన నోటితో ఆ నవజాత శిశువుకు శ్వాసను అందించింది. అలా సీపీఆర్ చేసిన కొద్దిసేపటి తర్వాత పసికందులో కదిలిక వచ్చింది. ఆ తర్వాత ఆ పసిపాప ఎంచక్కా కళ్లు తెరవడం, వైద్యురాలిని చూడడం వీడియోలో ఉంది.
Wife: కడుపునొప్పితో భార్య చనిపోయిందంటూ అత్తమామలకు ఫోన్.. వచ్చీ రాని మాటలతోనే తండ్రి దారుణాన్ని బయటపెట్టిన 6 ఏళ్ల కొడుకు..!
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ, వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్ (Viral) గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు వైద్యురాలిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'డాక్టరమ్మా.. నీకు హ్యాట్సాఫ్..' నిజంగా నీవు దేవతవి అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో అందిన సమాచారం ప్రకారం ఆ వైద్యురాలి పేరు సులేఖా చౌదరి అని, ఆగ్రాలోని సీహెచ్సీలో పనిచేస్తున్నారని తెలిసింది. కాగా, ఈ సీపీఆర్ వీడియో ఈ నెల 26వ తేదీన (గురువారం) 'mpanktiya' అనే పేరు గల ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ అయింది. ఇప్పటివరకు వీడియోకు 4.65 లక్షల వ్యూస్, 16.5వేల లైక్స్ వచ్చాయి.