ఓ యువకుడికి 20 రోజులుగా భరించలేని కడుపునొప్పి.. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు తీసిన ఎక్స్‌రేలో ఏం కనిపించిందంటే..
ABN , First Publish Date - 2023-01-21T20:06:36+05:30 IST
ఓ యువకుడు పుట్టింట్లో ఉన్న భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వారితో గొడవ జరిగింది. కొద్ది గంటల తర్వాత తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచి అతడికి కడుపు నొప్పి మొదలైంది. 20రోజులుగా తగ్గకపోవడంతో..
ఓ యువకుడు పుట్టింట్లో ఉన్న భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో వారితో గొడవ జరిగింది. కొద్ది గంటల తర్వాత తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచి అతడికి కడుపు నొప్పి మొదలైంది. 20రోజులుగా తగ్గకపోవడంతో చివరకు వైద్యులను సంప్రదించాడు. చివరకు ఎక్స్‌రే తీసిన వైద్యులు.. కడుపులో ఉన్న వస్తువును చూసి షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Viral Video: బీరు తాగుతూ బుల్లెట్‌పై ఎంజాయ్ చేసిన యువకుడు.. చివరకు పోలీసులు ఎలాంటి షాక్ ఇచ్చారంటే..
బీహార్ (Bihar) ముజఫర్‌పూర్‌లోని ఓ మెడికల్ కళాశాలలో వింత ఘటన చోటు చేసుకుంది. సాహిబ్‌గంజ్ పరిధి రాంపూర్ అస్లీ ప్రాంతానికి చెందిన యువకుడికి 20రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి (stomach ache) వస్తోంది. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కలగలేదు. దీంతో చివరకు వైద్యులను సంప్రదించాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు.. యువకుడి కడుపులో ఓ స్టీల్ గ్లాసు (Steel glass) ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో చివరకు రెండున్నర గంటల పాటు శ్రమించి, గ్లాసును బయటికి తీశారు. అయితే ఈ ఘటనపై ఆరాతీయగా.. షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. సదరు యువకుడికి భార్యతో కొన్నాళ్లుగా గొడవలు (Quarrel with wife) జరుగుతన్నాయి.
ఈ క్రమంలో చివరకు ఆమె విసిగిపోయి పుట్టింటికి వెళ్లింది. ఆమెను ఒప్పించి, ఇంటికి తీసుకొచ్చేందుకు ఇటీవల భర్త అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ అత్తమామలకు, యువకుడికి మధ్య గొడవ (quarrels) జరిగింది. ఈ క్రమంలో అత్తమామలు, కుటుంబ సభ్యులు అంతా కలిసి యువకుడిపై దాడి (attack) చేశారు. ఈ దాడిలో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన రోజు నుంచే కడుపు నొప్పి మొదలైంది. అల్లుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో అత్తమామలు.. గ్లాసును మల ద్వారం నుంచి చొప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.