salt water facts: ఉప్పు నీరు తాగితే ఆకలి ఎక్కువవుతుందా?... దీని వెనుకనున్న శాస్త్రీయత ఏమిటో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-07T08:18:44+05:30 IST

salt water facts: కొన్ని ప్రాంతాల్లో పార్టీలు, పెళ్లిళ్లకు హాజరైనవారెవరైనా అధికంగా ఆహారం తింటే వారిని ఉప్పునీరు(salt water) తాగి వచ్చారా? అని ఇతరులు అడుగుతుంటారు.

salt water facts: ఉప్పు నీరు తాగితే ఆకలి ఎక్కువవుతుందా?... దీని వెనుకనున్న శాస్త్రీయత ఏమిటో తెలిస్తే...

salt water facts: కొన్ని ప్రాంతాల్లో పార్టీలు, పెళ్లిళ్లకు హాజరైనవారెవరైనా అధికంగా ఆహారం తింటే వారిని ఉప్పునీరు(salt water) తాగి వచ్చారా? అని ఇతరులు అడుగుతుంటారు. ఈ వ్యవహారం పల్లెల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఉప్పునీరు తాగడం వల్ల నిజంగా అధికంగా ఆకలి(hunger) వేస్తుందా? ఉప్పునీరు తాగడం వల్ల ఆకలి ఎక్కువవుతుందని ఉత్తర భారతదేశం(India)లోని చాలామంది నమ్ముతుంటారు.

దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్(Scientific Reason) ఉందా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. దీనికి సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పునీరు తాగితే ఆకలి ఎక్కువవుతుందనే విషయం అపోహ(misconception) మాత్రమే అని తెలిపిన శాస్త్రవేత్తలు... భోజనం చేయడానికి కొన్ని గంటల ముందు చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఉప్పగా ఉండే పదార్థాలు తింటే, సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఆహారం తినవచ్చని తెలిపారు కానీ ఆకలి(hunger) పెరుగుతుందనే విషయాన్ని ఖండించారు.

అమెరికాలోని జనరల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ 2017 సంవత్సరంలో జరిపిన పరిశోధన(Research) ప్రకారం ఆహారంలో లేదా తాగే నీటిలో ఉప్పు కలిపితే ఆకలి పెరుగుతుంది. దీనిని 10 మందిపై ప్రయోగించారు. ఆహారం(food)లో ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే దాహం తక్కువగా, ఆకలి అధికంగా అనిపిస్తుందని కనుగొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉప్పునీరు తాగడం విపరీతమైన ఆకలికి దారితీస్తుందని అనడంలో కొంత శాస్త్రీయత(Science) ఉందని పరిశోధనల్లో వెల్లడయ్యింది.

Updated Date - 2023-03-07T08:28:29+05:30 IST