Dying in sleep: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? క్షణాల్లోనే మరణం.. అసలు ఎందుకిలా జరుగుతుందంటే..!
ABN , First Publish Date - 2023-08-08T14:28:23+05:30 IST
వర్కౌట్లు చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు ఉన్నపళంగా గుండెపోటుతో మృతిచెందిన వారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా నిద్రలోనూ గుండెపోటు సమస్య అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
వర్కౌట్లు చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు ఉన్నపళంగా గుండెపోటుతో మృతిచెందిన వారి గురించి తరచుగా వింటూనే ఉన్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ గుండె పోటు మరణాలు అందరినీ కభళిస్తున్నాయి. ఈ మధ్య మరీ దారుణంగా నిద్రలోనే గుండెపోటు రావడం, నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. కన్నడ నటుడు స్వర్గీయ రాజ్ కుమార్ గారి మేనల్లుడు అయిన విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన ఆదివారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందారు. ఈమె వయసు కేవలం 41ఏళ్ళే కావడం గమనార్హం. రెండేళ్ల కిందట పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ చేసిన తరువాత గుండెపోటుకు గురైతే, ఇప్పుడు స్పందన నిద్రలోనే గుండెపోటుతో మరణించింది(Heart attack while sleeping). అసలు నిద్రలో గుండెపోటు ఎందుకొస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే..
గుండెపోటు(Heart attack) సమస్యలు చాలామందిలో వారసత్వంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. లాంగ్ క్యూటి సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి జన్యుపరమైన సమస్యలు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి నిద్రలో గుండెపోటుకు కారణమవుతాయి.
కొందరికి పుట్టుకతోనే గుండె సంబంధ సమస్యలు ఉంటాయి. వీటిని స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అని అంటారు. గుండెలో లోపాలు, గుండె నిర్మాణంలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి గుండెలో ఎలక్ట్రికల్ సిస్టమ్ కు అంతరాయం కలిగిస్తాయి. ఈ కారణంగా కూడా నిద్రలోనే గుండెపోటు వస్తుంది.
గుండెకొట్టుకునే తీరు సరిగా లేకపోతే అది కార్డియాక్ అరెస్ట్ కు దారితీసే అవకాశం ఉంటుంది. గుండె స్పందన తీరు సరిగా లేకపోవడాన్ని వైద్యపరిభాషలో అరిథ్మియా అని అంటారు. అరిథ్మియా ఉన్నవారు నిద్రలో గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!
ఇప్పట్లో ఉబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలునున్నవారు గుండె జబ్బులకు చాలా తొందరగా లోనవుతారు. చిన్నవయసులో గుండె జబ్బుల బారిన పడుతున్నవారిలో అధికశాతం మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారే ఉండటం గమనార్హం.
గుండె జబ్బులు రాకూడదంటే..
రెగులర్ గా మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, చురుగ్గా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఒకటి రెండు సార్లకు మించి ఛాతీ నొప్పి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలు ఎదురైతే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబంలో తల్లిదండ్రులకు, అవ్వతాతలకు ఇలా వెనుకటి తరం వారికి గుండె సంబంధ సమస్యలు ఉన్నాయేమో తెలుసుకుని జాగ్రత్తపడాలి. ముఖ్యంగా 40ఏళ్ల తరువాత గుండెపోటు గురించి అవగాహన పెంచుకోవడం, దానికి తగ్గట్టు జీవనశైలి మార్చుకోవడం ఎంతో ముఖ్యం.