Earth Hour 2023: ముంబైలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం
ABN , First Publish Date - 2023-03-25T22:30:29+05:30 IST
ఎర్త్ అవర్-2023 (Earth Hour-2023) గుర్తుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminul) వద్ద గంటపాటు లైట్లు ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముంబై: ఎర్త్ అవర్-2023 (Earth Hour-2023) గుర్తుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminul) వద్ద గంటపాటు లైట్లు ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 'ఎర్త్ అవర్' ఈవెంట్ నిర్వహణలో భాగంగా వాతావరణ మార్పుల సవాళ్లు, శక్తి పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు,కార్యాలయాల్లోని అన్ని లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహించారు.
'ఎర్త్ అవర్' అనేది ప్రతి సంవత్సరం మార్చి చివరి శనివారం జరిగే వార్షిక గ్లోబల్ ఈవెంట్(An Annual global event). ఈ ఏడాది మార్చి 25న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు, 190 కంటే ఎక్కువ దేశాలు భూభాగాల నుండి మిలియన్ల మంది మద్దతుదారులు ఈ ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీల్లో సిబ్బంది కూడా అనవసరమైన లైట్లను ఆఫ్ చేయడం ద్వారా 'ఎర్త్ అవర్'లో పాల్గొన్నాయి.
'లైట్స్ ఆఫ్' క్షణం అని పిలువబడే ఈ సింబాలిక్ చర్య(This symbolic act), భూగ్రహం కోసం మద్దతునిచ్చే ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తుంది. అంతేకాకుండా మనం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు గుర్తుగా పనిచేస్తుంది. ఈ విధంగా కలిసి రావడం ద్వారా, భూగ్రహం పరిరక్షణకు రక్షించడానికి చర్య తీసుకోవాల్సిన తక్షణ ఆవశ్యకత గురించి అవగాహన పెంచుకోవచ్చు.
ఎర్త్ అవర్‌ను ఎలా జరుపుకుంటారు?
"ఎర్త్ అవర్"ను స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు ఒక గంటపాటు అన్ని లైట్లను ఆఫ్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తారు. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అవ్వడం, భోజనం వండడం, కుటుంబం, ఇష్టమైనవారితో విలువైన సమయాన్ని గడపడం, కళతో సృజనాత్మకతను పొందడం వంటి వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఎర్త్ అవర్‌ను జరుపుకోవచ్చు.
ఎర్త్ అవర్ చరిత్ర
‘‘ఎర్త్ అవర్’’ అనే భావన 2007లో ఉద్భవించింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) సిడ్నీ, దాని భాగస్వాములు వాతావరణ మార్పుల గురించి అవగాహన కల్పించడానికి ఆస్ట్రేలియాలో సింబాలిక్ లైట్స్-అవుట్ ఈవెంట్‌ను ప్రారంభించారు. మొదటగా మార్చి 31, 2007న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు సిడ్నీలో జరిగింది, అక్కడ ప్రజలు ఒక గంట పాటు లైట్లు ఆర్పేలా ప్రోత్సహించారు.
మరుసటి సంవత్సరం, ఈవెంట్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.మార్చి 29, 2008న ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు పాల్గొన్నారు. అప్పటి నుండి, ఎర్త్ అవర్‌కు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది, ఇప్పుడు దీనిని మార్చి చివరి శనివారం నాడు జరుపుతున్నారు. ఈ ఏడాది 17వ ఎర్త్ అవర్ ఈవెంట్ జరుపుకుంటున్నాం.
ప్రాముఖ్యత
ఎర్త్ అవర్ ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుండి గణనీయంగా దీని ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాల నుండి మిలియన్ల కొద్ది మద్దతుదారులున్నారు. భూమిపై నివసించే ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం చర్య తీసుకోవడానికి అందరూ కలిసి ముందుకు సాగుతున్నారు. సానుకూల పర్యావరణ మార్పుల కోసం ఓ శక్తివంతమైన ఆయుధంగా ఎర్త్ అవర్ ఈవెంట్ ప్రాముఖ్యతను చాటుకుంటోంది. ప్రజల సమిష్టి శక్తి, వారి చర్యల ద్వారా సమూల మార్పులను తీసుకురావడాని ఈ ఈవెంట్ ఒక వేదికగా మారింది.
ఈ ఈవెంట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పర్యావరణ పరిరక్షణకు తగిన భవిష్యత్ కార్యచరణ రూపొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సమూహాలు, సంస్థల పరంగా అర్థవంతమైన చర్యలు తీసుకోవడం ఎర్త్ అవర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేస్తే వార్షిక ఉద్గారాల ప్రభావం తక్కువ ఉండే అవకాశం ఉంది. అందరూ సంఘీభావంతో ఈ చర్యను చేపడితే పెద్దమొత్తంలో ఉపయోగం ఉండొచ్చు. వందలాది స్థానికంగా సెలబ్రిటీలు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు ఈ శనివారం ఎర్త్ అవర్స్ ప్రణాళికలు సిద్దం చేయడం అవగాహన పెంపొందించొచ్చు.