Viral News: మా నాన్నను అమ్మేస్తున్నా.. ఎవరైనా కొంటారా..? అంటూ ఇంటి గేటుకు బోర్డు పెట్టిన పిల్లాడు.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!
ABN , First Publish Date - 2023-10-04T19:42:33+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పిల్లల ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. కొందరు పిల్లలు చదువును పక్కన పెట్టి.. నిత్యం వీడియో గేమ్‌లు ఆడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే.. మరికొందరు తమ తెలివితేటలను వీడియోలు, ఫొటోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ఈ క్రమంలో...
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో పిల్లల ప్రవర్తనలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. కొందరు పిల్లలు చదువును పక్కన పెట్టి.. నిత్యం వీడియో గేమ్‌లు ఆడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే.. మరికొందరు తమ తెలివితేటలను వీడియోలు, ఫొటోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ఈ క్రమంలో కొందరి క్రియేటివిటీ చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. ఇలాంటి క్రియేటివిటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పిల్లాడి తెలివితేటలకు సంబంధించిన ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మా నాన్నను అమ్మేస్తున్నా.. ఎవరైనా కొంటారా..? అంటూ ఓ పిల్లాడు ఇంటి గేటుకు బోర్డు పెట్టాడు. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. తండ్రిపై కోపం పెంచుకున్న ఓ 8ఏళ్ల బాలుడు (8 year old boy) ఎలా పగ తీర్చుకోవాలా అని ఆలోచించాడు. చివరకు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ‘‘మా నాన్నను రూ.2లక్షలకు అమ్మేస్తున్నా.. ఎవరైనా కొంటారా’’.. అని రాసిన బోర్డును ఇంటి బయట గేటుకు అంటించాడు. ఈ బోర్డును చూసిన వారంతా.. పగలబడి నవ్వుకుంటున్నారు.
కొందరు దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో (Viral photo) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ బుడ్డోడు చాలా ఫన్నీగా ఉన్నాడే’’.., ‘‘చిన్న పిల్లాడైనా 2లక్షలు రేటు కట్టడం గ్రేట్’’.., ‘‘మీ వాడే నయం.. మా కూతుర్తెలు అయితే నన్ను రూ.20లకు అమ్మేస్తారు’’.., ‘‘మీ అబ్బాయి మీకు మంచి విలువే ఇచ్చాడండి’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 29వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.