Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2023-04-18T14:19:17+05:30 IST

నెట్టింట కనిపించే కొన్ని వీడియోలు, ఫొటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టవు.

Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..

Viral Video: నెట్టింట కనిపించే కొన్ని వీడియోలు, ఫొటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టవు. అలా చూస్తూ ఉండిపోతాం. అవి అంతలా మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంతో పాటు మన హృదయాలను తాకుతాయి. దాంతో వాటిని ఎన్నిసార్లు చూసిన ఇంకా చూడాలపిస్తుంటుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ వృద్ధ జంట ట్రైన్ జర్నీకి సంబంధించినదా వీడియో. వారిద్దరూ కలిసి ఇంతకుముందు ఇలాంటి ఎన్నో రైలు ప్రయాణాలు చేసి ఉంటారు. కానీ, ఈ ప్రయాణం మాత్రం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అసలు వీడియోలో ఏముంది? నెటిజన్లను అంతగా ఎమోషన్‌కు గురి చేస్తున్న విషయం ఏంటి? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఈ వీడియోను ఆర్ మైనీ ( r.maini.) అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశారు. వృద్ధ దంపతులు రైలు జర్నీకి సంబంధించిన ఈ వీడియోను.. అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణీకుడు సీక్రెట్‌గా చిత్రీకరించాడు. అనారోగ్యంతో ఉన్న భార్యకు భర్త సపర్యలు చేయడం మనం వీడియోలో చూడొచ్చు. జబ్బు పడిన ఆమెకు ఎంతో ప్రేమగా ముద్దలు తినిపించడం వీడియోలో ఉంది. అంతేగాక.. రాత్రివేళ కూడా భార్యను చేయి పట్టుకుని టాయిలెట్‌కు తీసుకెళ్లడం దగ్గరి నుంచి ఆమె నిద్రపోయే వరకు పక్కనే కూర్చొని పెద్దాయన సపర్యలు చేసినట్లు ఈ వీడియో చిత్రీకరించిన ప్రయాణీకుడు తెలిపాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆరు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Snake vs Birds Video: పిట్టలే కదా.. ఏం చేస్తాయ్‌లే అనుకుంటే చుక్కలు చూపించాయిగా.. ఏడు పక్షులు ఆ పామును రౌండప్ చేసి మరీ..!


ఇక ఈ వయసులో కూడా ఆ వృద్ధ దంపతులు అలా ఎంతో ప్రేమగా ఉండడం చూసి, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. 'ఇది కదా నిజమైన ప్రేమంటే' అని అంటున్నారు. 'ఈ వయసులో ఇలాంటి ప్రేమ చాలా బాగుంది. కానీ, ఇది ఓపికకు పరీక్ష లాంటిది. దాన్ని అందుకోవడం అంతా ఈజీ కాదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'ప్రేమంటే ఇవ్వడం. మన వైపు నుంచి భక్తిలా ఉండాల్సిందే' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Highest Paid Government Jobs: అల్లాటప్పా ప్రభుత్వోద్యోగాలు కాదండోయ్.. ఈ పది జాబ్స్‌లో ఒక్కటి కొట్టినా చాలు..!

Shalini Pandey: ఓ రేంజ్‌లో గ్లామర్ ఒలకబోస్తోన్న ‘అర్జున్ రెడ్డి’ భామ.. చూస్తే మతిపోవాల్సిందే..!

Shriya Saran: వామ్మో.. శ్రియ అందాలు చూస్తే.. పడిపోవాల్సిందే..!



Updated Date - 2023-04-19T13:45:07+05:30 IST