ఈ ఫొటోలోని కుర్రాడికి పెద్ద కథే ఉంది.. 10 ఏళ్ల తర్వాత కూడా పోలీసులు అతడిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లారంటే..
ABN , First Publish Date - 2023-02-02T20:58:58+05:30 IST
కొందరు చిన్న చిన్న సమస్యలకే తెగ ఆందోళన పడిపోతుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది.. మరికొన్నిసార్లు అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే కుర్రాడి గురించి తెలుసుకున్న వారంతా..
కొందరు చిన్న చిన్న సమస్యలకే తెగ ఆందోళన పడిపోతుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది.. మరికొన్నిసార్లు అయ్యో పాపం! అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే కుర్రాడి గురించి తెలుసుకున్న వారంతా అవాక్కవుతున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా పోలీసులు అతడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ అతడు చేసిన నిర్వాకం ఏంటంటే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్పూర్ పరిధి సివిల్ లైన్ సమీపంలోని సన్ సిటీ కాలనీకి చెందిన 25ఏళ్ల రాజేంద్ర ప్రజాపతి అనే యువకుడిని ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బిలాస్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడి గురించి తెలుసుకుని చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా అవాక్కవుతున్నారు. రాజేంద్ర పదో తరగతి (10th class) చదువుతున్న సమయంలో పరీక్షలు (Exams) రాయాల్సి వచ్చింది. అయితే ఇతడికి ముందు నుంచీ పరీక్షలంటే ఎంతో (fear) భయం. దీంతో ఎక్కడ ఫెయిల్ అవుతానో అనే ఆందోళనతో చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు. కొడుకు కనపడకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. కానీ నెలల గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో బాధను దిగమింగుకుని.. ఎప్పటికైనా తిరిగొస్తాడనే ఆశతో ఎదురుచూస్తూ ఉండేవారు.
ప్రేమ పెళ్లి చేసుకున్న 7 నెలలకే ఊహించని షాక్.. అర్ధరాత్రి కట్టుకున్న భార్యే ఆ భర్త గొంతు కోసింది..!
ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజేంద్ర.. మహోబా, ఝాన్సీ, హర్యానా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల్లో దాబాల్లో కూలీగా పని చేశాడు. ఈ క్రమంలో కొడుకు కోసం ఆశగా ఎదురు చూస్తున్న అతడి తల్లి.. 2016లో మృతి చెందింది. కొడుకును చూడాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే కన్నుమూశారు. రాజేంద్ర జాడ తెలీకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇటీవల ఓ రోజు రాజేంద్ర ఆధార్ కార్డు తీసుకునే క్రమంలో.. అతడి పాత ఆధార్ కార్డుకు అనుసంధానం అయి ఉన్న నంబర్‌కు కొత్త నంబర్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి విషయం తెలియజేశారు. సదరు నంబర్ ఆధారంగా రాజేంద్రను గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకొచ్చారు.
కుటుంబ సభ్యులను చూసిన రాజేంద్ర.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అంతలో తన తల్లి చనిపోయిందని తెలుసుకుని కుమిలిపోయాడు. పరీక్షలంటే భయంతో పదేళ్ల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. తన జీవితంలో ఎంతో కోల్పోయానని, చివరకు తల్లిని చివరిసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని బోరున విలపించాడు. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి.. ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయొద్దని, రాజేంద్రని చూసి మిగతా వారు కూడా ఇలాంటి పనులు చేయొద్దని పోలీసులు సూచించారు. మొత్తానికి రాజేంద్ర ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.