Eye Health: ఏళ్ల తరబడి కళ్లజోళ్లను వాడుతున్నారా..? అసలు వాటి అవసరమే లేకుండా చేయాలంటే..!
ABN , First Publish Date - 2023-09-14T10:42:13+05:30 IST
ఒకప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం ఫ్యాషన్ అయితే ఇప్పుడు కళ్లజోడు లేకపోతే ఎంతబాగుంటుందో అనుకునేవారు ఉన్నారు. ఇలాంటివారు నిరాశ పడాల్సిన పని లేదు. సహజంగా కంటి చూపు ను మెరుగుపరుచుకోవచ్చు. కేవలం నెలరోజుల్లో కళ్లజోడు పక్కన పెట్టేయచ్చు.
కళ్ళజోడు ఇప్పట్లో 100మందిలో కనీసం సగానికిపైగా వినియోగిస్తున్నారు. చిన్నతనం నుండే గంటల తరబడి చదవడం, నైటౌట్లు చేయడంతో మొదలు, కంప్యూటర్ల ముందు ఉద్యోగాలు చేయడం వరకు ఎన్నో కారణాలు కంటి చూపును దెబ్బతీస్తున్నాయి. దీనికి తగనట్టు నేటికాలం ఆహార శైలి కూడా కంటిచూపును బలహీనపరిచే ఒక అంశం. ఒకప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం ఫ్యాషన్ అయితే ఇప్పుడు కళ్లజోడు లేకపోతే ఎంతబాగుంటుందో అనుకునేవారు ఉన్నారు. ఇలాంటివారు నిరాశ పడాల్సిన పని లేదు. సహజంగా కంటి చూపు మెరుగవ్వాలన్నా, ఇకమీదట కళ్ళజోడు అనే ఒక వస్తువు లైఫ్ లో ఉండకూడదు అనుకున్నా నెలరోజులపాటు ఈ కింద చెప్పుకునే పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండ్లు కంటిచూపును మెరుగుపరచి జీవితకాలం కళ్ళజోడు అవసరం లేకుండా చేస్తాయి(eye sight improvement fruits). అవేంటో తెలుసుకుంటే..
సిట్రస్ పండ్లు..(citrus fruits)
కంటిచూపు మెరుగుపరచుకోవడానికి ఆహారంలో సిట్రస్ పండ్లు తీసుకుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ తినేవే కదా అని డౌట్ వవస్తుందేమో. కానీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు కనీసం ఒక్కటయినా సిట్రస్ పండును నెలరోజులపాటు తీసుకుంటే కంటిచూపు అధ్బుతంగా మెరుగవుతుంది. విటమిన్-సి కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేవలం కంటి చూపు మెరుగుపరచడమే కాదు, వృద్దాప్య ఛాయలు తగ్గిస్తుంది, జుట్టుఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుంది.
Marriage Card: నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి కార్డు.. అందులో రాసి ఉన్న పదాలను చూసి పేలుతున్న సెటైర్లు..!
అరటిపండు..(banana)
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి అరటిపండ్లు. బాగా ఆకలిగా అనిపించినప్పుడు రెండు అరటిపండ్లు తింటే చాలు సుమారు ఒక గంట వరకు ఆకలి అనే సమస్య వేధించదు. అరటిపండులో పొటాషియం, విటమిన్-ఎ ఉంటాయి. కళ్లు పొడిబారే సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపండ్లు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఇందులో ఉంటే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అరటిపండులో విటమిన్-సి తో పాటు విటమిన్-ఎ కూడా ఉంటుంది. కాబట్టి రోజూ అరటిపండును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
బెర్రీలు..(berry fruits)
బెర్రీలు విదేశీ పండ్లు. ఇవి కంటి ఆరోగ్యానికి చాలామంచివిగా పరిగణిస్తారు. వివిధ రకాల బెర్రీలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపచడంలో సహాయపడుతుంది. బెర్రీలలో ఉంటే ఇతర విటమిన్లు, ఖనిజాలు కంటిచూపును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఆప్రికాట్..(Apricots)
ఆప్రికాట్ లను తెలుగులో నేరేడు పండ్లు అని పిలుస్తారు. అలాగని ఇవి మనం తినే నలుపురంగులో ఉండే అల్లనేరేడు పండ్లు కాదు. ఇవి పసుపురంగులో ఉంటాయి. ఈ ఆప్రికాట్లలో విటమిన్ -ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, కెరోటినాయిడ్లు, బీటాకెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బీటా కెరోటిన్ ప్రొవిటమిన్ గా పనిచేస్తుంది. అంటే శరీరంలో చేరే విటమిన్-ఎను గ్రహించడంలో, దాన్ని శరీరం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
బొప్పాయి..(papaya)
కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కంటి చూపు మెరుగు పరుచుకోవడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. బొప్పాయిలో కూడా విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.