Viral Video: నీకు హ్యాట్సాఫ్ బ్రదర్.. రోడ్డు పక్కన టేబుల్ వేసి.. అన్నం కూరలు అమ్ముతున్న ఈ కుర్రాడెవరో.. అతడి కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-08T11:34:50+05:30 IST

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ స్టాండ్స్ (Street food stands) మనకు చాలానే కనిపిస్తుంటాయి.

Viral Video: నీకు హ్యాట్సాఫ్ బ్రదర్.. రోడ్డు పక్కన టేబుల్ వేసి.. అన్నం కూరలు అమ్ముతున్న ఈ కుర్రాడెవరో.. అతడి కథేంటో తెలిస్తే..

ఫరీదాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ స్టాండ్స్ (Street food stands) మనకు చాలానే కనిపిస్తుంటాయి. ఆ రోడ్‌సైడ్ ఫుడ్స్ (Road Side Foods) చాలా మంది కడుపు నింపుతుంటాయి కూడా. అయితే, వాటిని నడేపివారిది ఒక్కొక్కరిది ఒక్కొ కథ ఉంటుంది. అలాగే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీలో స్ట్రీట్ ఫుడ్ స్టాండ్ ఉన్న ఈ కుర్రాడిది ఒక స్టోరీ ఉంది. ఇంకా చెప్పాలంటే మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీ (Inspiring Story) అని చెప్పొచ్చు. ఓ ఫుడ్ బ్లాగర్ (Food Blogger) ఆ యువకుడిని ఇంటర్వ్యూ చేయడంతో ఈ విషయం తెలిసింది. రోడ్డు పక్కన టేబుల్ వేసుకుని మరి అన్నం కూరలు అమ్ముతున్న ఆ కుర్రాడెవరు? అతడి కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫుడ్ బ్లాగర్ విశాల్ శర్మ చెప్పిన దాని ప్రకారం.. ఇలా రోడ్‌సైడ్ ఫుడ్ అమ్ముతున్న ఆ కుర్రాడు ఓ స్టూడెంట్ (Student). అతనికి దొరికే ఖాళీ సమయంలో ఫరీదాబాద్ (Faridabad) పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ కమ్యూనిటీలో రోడ్డు పక్కన టేబుల్ వేసుకుని ఓ నాలుగు కర్రీస్, అన్నం పెట్టుకుని చాలా కాలంగా అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఫుడ్ బ్లాగర్ విశాల్ శర్మ అతడిని పలకరించాడు. దాంతో అతడు తన స్టోరీ చెప్పాడు. మొదట తాను అక్కడ విక్రయిస్తున్న ఫుడ్ ఐటమ్స్ గురించి వివరించాడు. కాధీ, చావల్(అన్నం), రాజ్‌మా, దాల్, రోటి, పన్నీర్ అమ్ముతున్నట్లు చెప్పిన అతడు.. వాటిని తన ఇంటి వద్ద తానే స్వయంగా వండుకుని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. అలాగే వాటి ధరలు కూడా చెప్పాడు.

Viral Video: మా నాన్న అన్నీ చెప్తారు.. మా అమ్మకు పిరియడ్స్ వస్తే ప్యాడ్స్‌ మేమే తెస్తాం.. వైరల్ అవుతున్న కుర్రాడి వీడియో..!


ఇలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇలా ఫుడ్ స్టాండ్ నడిపియడం, అందులోనూ వాటిని తానే స్వయంగా ప్రిపేర్ చేసుకుని తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అని నెటిజన్లు (Netizens) చెబుతున్నారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. "ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది మీ జీవితంలో అత్యుత్తమ నిర్ణయం. మీరు దేశానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్త కావాలని మేము కోరుకుంటున్నాము" అని ఒకరు, "మీ చిరునవ్వు మరియు విశ్వాసం నాకు నచ్చింది" అని మరొకరు, "నేను నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను" అని ఇంకోకరు కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 1.5లక్షల మంది వీక్షించగా, 4,500 వరకు లైక్స్ వచ్చాయి.

Viral News: అబ్బా.. పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.. వీటిల్లో జీలకర్ర ఏదో, సోంపు ఏదో చెప్పమంటూ ప్రియుడికి ఫొటోలు తీసి పెడితే..!

Updated Date - 2023-04-08T11:34:50+05:30 IST