Rajasthan Crime: బాలికపై సామూహిక అత్యాచారం.. చితిపై దూకేందుకు తండ్రి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-08-07T18:02:00+05:30 IST

తండ్రులు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించొచ్చేమో గానీ, మనసులో మాత్రం అంతులేని ప్రేమ దాగి ఉంటుంది. తన ఆశలు, కోరికలు చంపుకొని.. పిల్లల సంతోషం కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. తన ఒళ్లు హూనమైనా సరే లెక్క చేయరు. ఒకవేళ ఆదపలో ఉంటే, తమ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుతారు.

Rajasthan Crime: బాలికపై సామూహిక అత్యాచారం.. చితిపై దూకేందుకు తండ్రి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

తండ్రులు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించొచ్చేమో గానీ, మనసులో మాత్రం అంతులేని ప్రేమ దాగి ఉంటుంది. తన ఆశలు, కోరికలు చంపుకొని.. పిల్లల సంతోషం కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. తన ఒళ్లు హూనమైనా సరే లెక్క చేయరు. ఒకవేళ ఆదపలో ఉంటే, తమ ప్రాణాలు అడ్డేసి మరీ కాపాడుతారు. పిల్లలకి ఏ కష్టమొచ్చినా, ఏమాత్రం సహించలేరు. కొందరు తండ్రులైతే.. తమ పిల్లల మరణాల్ని తట్టుకోలేక, బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తన కూతురు హత్యాచారానికి గురైన బాధని జీర్ణించుకోలేక.. ఒక తండ్రి కూతురి చితిపైనే దూకి, ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే.. స్థానికులు అతడ్ని చితి నుంచి బయటకు తీయడంతో, ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..


భిల్వారా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక ఆగస్టు 2వ తేదీన పశువులు మేపేందుకు వెళ్లి, కనిపించకుండా పోయింది. ఎంతసేపైనా కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. తండ్రి ఆమె కోసం గాలించాడు. కానీ, ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, బాలిక కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆగస్టు 4వ తేదీన సగం కాలిన బాడీ పార్ట్స్ లభ్యమయ్యాయి. ఆనవాళ్లను బట్టి.. ఆ బాడీ పార్ట్స్ ఆగస్టు 2వ తేదీన అదృశ్యమైన మైనర్ బాలికవేనని నిర్ధారించారు. పోలీసుల విచారణలో భాగంగా.. ఆ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని, అదే రోజే ఆమెను చంపేసి, మృతదేహాన్ని కాల్చేసేందుకు దుండగులు ప్రయత్నించారు తేలింది. ఆధారాల్ని నాశనం చేయడానికే, ఆ బాలిక మృతదేహాన్ని ఇలా బొగ్గు కొలిమిలో కాల్చినట్టు పోలీసులు పేర్కొన్నారు.

స్థానికంగా ఈ హత్యాచారం తీవ్ర సంచలనం రేపడంతో.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ నేరంలో మొత్తం పది మంది హస్తం ఉందని.. అందులో ఆరుగురు మగవారు కాగా, నలుగురు మహిళలూ ఉన్నారని అధికారులు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనదిగా వారు పేర్కొన్నారు. మరోవైపు.. కూతురి పట్ల ఇంత అఘాయిత్యం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తండ్రి.. కూతురి చితిపై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. స్థానికులు వెంటనే అతడ్ని రక్షించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. అక్కడక్కడ గాయాలయ్యాయని చెప్పారు.

Updated Date - 2023-08-07T18:02:00+05:30 IST