Father: కంగారుగా ఇంటికొచ్చిన తండ్రి.. చేతులకు అంటిన రక్తం.. పక్కన అక్క లేకపోవడంతో చిన్న కూతురికి డౌట్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-11-29T15:56:16+05:30 IST
రాజస్థాన్‌లోని పాలి అనే చిన్న టౌన్‌లో జరిగిన దారుణం స్థానికులను షాక్‌కు గురి చేసింది.. ఓ వ్యక్తి తన కన్న కూతురిని అత్యంత కర్కశంగా నరికి చంపాడు.. అదీ పన్నేండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కూతురితో పైశాచికంగా ప్రవర్తించాడు..
రాజస్థాన్‌లోని (Rajasthan) పాలి అనే చిన్న టౌన్‌లో జరిగిన దారుణం స్థానికులను షాక్‌కు గురి చేసింది.. ఓ వ్యక్తి తన కన్న కూతురిని అత్యంత కర్కశంగా నరికి చంపాడు (Father Killed daughter).. అదీ పన్నేండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కూతురితో పైశాచికంగా ప్రవర్తించాడు.. పెళ్లయిన పన్నెండేళ్ల తర్వాత మొదటిసారి తన తండ్రిని కలవడానికి వచ్చిన వివాహిత హత్యకు గురైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు (Crime News).
పాలికి చెందిన శివలాల్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు నిర్మా దేవి పన్నేండేళ్ల క్రితం వివాహం చేసుకుని గుజరాత్‌లోని గాంధీ ధామ్‌లో తన భర్తతో కలిసి నివసిస్తోంది. చిన్న కూతురు తండ్రి దగ్గరే ఉంటోంది. ఓ పెళ్లి కోసం నిర్మా దేవి ఇటీవల పాలి వచ్చింది. తండ్రి, సోదరితో కలిసి వివాహానికి హాజరైంది. అనంతరం ముగ్గురూ కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కూతురిని దించేసి పెద్ద కూతురిని తీసుకుని శివలాల్ అడవిలోకి వెళ్లాడు. అక్కడ పెద్ద కూతురు నిర్మాను గొంతు కోసి చంపాడు.
Marriage: కట్నం కాదండోయ్.. మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.31 కోట్లు.. పెళ్లిలో వరుడిపై కనకవర్షం..!
ఒంటరిగా ఇంటికి వచ్చిన తండ్రిని చూసి చిన్న కూతురికి అనుమానం వచ్చింది. చేతులకు ఉన్న రక్తాన్ని కడుక్కుంటున్న తండ్రిని చూసి అనుమానం వచ్చిన చిన్న కూతురు.. అక్క ఏదంటూ కేకలు పెట్టింది. దీంతో శివలాల్ బయటకు పారిపోయాడు. చుట్టుపక్కల వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శివలాల్‌ను కొన్నేళ్ల క్రితం అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. తన భార్య తనను వదిలేయడంలో పెద్ద కూతురి పాత్ర ఉందని ఆమెపై శివలాల్ ఆగ్రహం పెంచుకున్నాడు. సమయం చూసి ఆమెను కడతేర్చాడు. పరారీలో ఉన్న శివలాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.