Fathers Love : తాను అమరుడైనా బిడ్డను పట్టుకొని రక్షించాడు...తండ్రి ప్రేమ

ABN , First Publish Date - 2023-02-10T12:54:06+05:30 IST

టర్కీ, సిరియా దేశాలను అల్లాడించిన భారీ భూకంపం తాలూకూ విషాద గాథలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి....

Fathers Love : తాను అమరుడైనా బిడ్డను పట్టుకొని రక్షించాడు...తండ్రి ప్రేమ
Fathers Love

టర్కీ, సిరియా భారీ భూకంపం వల్ల పలు విషాద గాథలు వెలుగుచూస్తున్నాయి. ఈ విపత్తు వల్ల జరిగిన ప్రాణ నష్టం చూస్తే కన్నీళ్లు రాక మానవు.

అంకారా(టర్కీ): టర్కీ, సిరియా దేశాలను అల్లాడించిన భారీ భూకంపం తాలూకూ విషాద గాథలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి.భూకంపం వల్ల భవనం కుప్పకూలిపోయి మీద పడిన ఓ తండ్రి తన కుమారుడి పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నాడు. భూకంపం శిథిలాల కింద చిక్కుకొని తండ్రి అమరుడైనా, తన పండంటి బిడ్డను మాత్రం గట్టిగా పట్టుకొని అతన్ని రక్షించాడు.

శిథిలాలను తొలగిస్తుండగా తండ్రి మరణించిన అతని చేతుల్లో ఉన్న కుమారుడు మాత్రం బతికే ఉన్నారు.(child was saved) మరణిస్తూ కుమారుడిని కాపాడిన తండ్రి ప్రేమకు నిదర్శనంగా నిలిచారు. తాను మరణిస్తూ చిన్నారి కుమారుడిని పొదివి పట్టుకోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇది కూడా చదవండి : Turkey Syria earthquake: క్షతగాత్రురాలైన టర్కీ బాలికకు ఇండియన్ ఆర్మీ వైద్యుల చికిత్స

రెస్క్యూ బృందం సజీవంగా ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. తండ్రి మృతదేహాన్ని వెలికితీసి శ్మశాసవాటికకు తరలించారు. తండ్రి ప్రేమకు చిహ్నంగా ముహమ్మద్ అహతీషం అహసన్(mohdahtishamah) ట్వీట్(Tweet) చేశారు. ఈ ట్వీట్ తండ్రి ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.

Updated Date - 2023-02-10T12:54:09+05:30 IST