భార్య కోసం భర్త అగచాట్లు.. పుట్టింట్లోనే ఉండిపోతున్న భార్య కోసం వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం..
ABN , First Publish Date - 2023-03-12T17:08:36+05:30 IST
ఆ వ్యక్తికి ఏడాది క్రితం వివాహం జరిగింది.. కొన్ని రోజులు అతడితో భార్య బాగానే కలిసి ఉంది.. ఆ తర్వాత ఆమెకు ఏమైందో ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ పడడం మొదలుపెట్టింది..
ఆ వ్యక్తికి ఏడాది క్రితం వివాహం జరిగింది.. కొన్ని రోజులు అతడితో భార్య బాగానే కలిసి ఉంది.. ఆ తర్వాత ఆమెకు ఏమైందో ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ పడడం మొదలుపెట్టింది.. భర్త తప్పేం లేకుండానే ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.. ఇంటికి తిరిగి రమ్మని భర్త ఎంత మొత్తుకున్నా ఆమె ససేమిరా అంటోంది.. దీంతో ఆ వ్యక్తి తన భార్య పుట్టింటికి వెళ్లి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించి చావు దెబ్బలు తిన్నాడు (Crime News).
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) అశోక్ నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. 19 ఏళ్ల అతడి భార్య మూడు నెలలు బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త తప్పేం లేకపోయినా ప్రతి విషయానికి అతడితో గొడవ పడేది. ఆరు నెలల క్రితం భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి అక్కడే ఉంటోంది. భర్త ఎంత బతిమాలినా తిరిగి అతడి వద్దకు వెళ్లడం లేదు. దీంతో ఆ యువకుడు శనివారం ఉదయం తన భార్య పుట్టింటికి వెళ్లాడు (Husband and wife dispute).
``మీ నాన్న నా అప్పు తీర్చనవసరం లేదు.. నేను చెప్పినట్టు చెయ్యి``.. ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి చేసిన పనికి..
తనతోపాటు ఇంటికి రావాలని భార్యను వేడుకున్నాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురై భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె, ఆమె సోదరుడు యువకుడిని చితకబాదారు. పెద్ద కర్రతో విపరీతంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన యువకుడిని బయట పడేసి అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.