WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అవతలి వాళ్లు పంపిన మెసేజ్‌కు బదులుగా ఎందుకిలా వస్తుందంటే..

ABN , First Publish Date - 2023-05-16T16:10:35+05:30 IST

ఎవరైనా వాట్సప్‌లో (WhatsApp) మెసేజ్ పంపిన తర్వాత కూడా కొన్నిసార్లు వెయిటింగ్‌ ఫర్‌ దిస్‌ మెసేజ్‌.. చెక్‌ యువర్‌ ఫోన్‌ అని మొబైల్‌ వెర్షన్‌తో పాటు

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? అవతలి వాళ్లు పంపిన మెసేజ్‌కు బదులుగా ఎందుకిలా వస్తుందంటే..
WhatsApp

వాట్సప్.. జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్‌కి చిన్న సౌండ్ రాగానే వెంటనే ఏం మెసేజ్ వచ్చిందా? అని వెంటనే వాట్సప్ చెక్ చేసుకుంటాం. అంతగా దానితో జీవితం ముడిపడిపోయింది. ఇక వాట్సప్‌లో ఏదైనా చిన్న సమస్య తలెత్తితే ఎంత గాబరా పడిపోతారో చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని సార్లు వాట్సప్‌లో బ్లాంక్ మెసేజ్‌లు వస్తుంటాయి. దాని చూసి ఏదో అయిపోయిందని కంగారు పడుతుంటారు. అలా ఎందుకు అవుతుంది. ఏదైనా ప్రోబ్లమా? ఇంకేదైనా సమస్యనా? అలా వస్తే ఏం చేయాలో.. దానికి అర్థమేంటో తెలుసుకుందాం.

ఎవరైనా వాట్సప్‌లో (WhatsApp) మెసేజ్ పంపిన తర్వాత కూడా కొన్నిసార్లు వెయిటింగ్‌ ఫర్‌ దిస్‌ మెసేజ్‌.. చెక్‌ యువర్‌ ఫోన్‌ అని మొబైల్‌ వెర్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌/వెబ్‌ వెర్షన్లలో కనిపిస్తుంది. ఈ మెసేజ్‌ వెబ్‌ వాట్సప్‌లో వచ్చిన వెంటనే ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్ చేయగానే అవతలి వ్యక్తి పంపిన మెసేజ్‌ కనిపిస్తుంది. ఇంతకీ ఆ మెసేజ్‌ అర్థం ఏంటి? దీనిపై వాట్సప్‌ ఏం చెబుతుందో చూద్దాం. వాట్సప్‌లో అప్పుడప్పుడు కనిపించే ఈ మెసేజ్‌ను టెక్‌ నిపుణులు టెక్నికల్ ఎర్రర్‌ అని చెబుతుంటే.. వాట్సప్‌ మాత్రం అదేం పెద్ద సమస్య కాదని చెబుతోంది. ప్రధానంగా మూడు కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని అంటోంది.

మెసేజ్‌ (message) పంపిన వ్యక్తి లేదా రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తమ ఫోన్లలో కొత్తగా వాట్సప్‌ ఇన్‌స్టాల్ చేస్తే ‘వెయిటింగ్‌ ఫర్‌ ది మెసేజ్‌’ అని కనిపిస్తుంది. అలానే ఫోన్‌లో వాట్సప్‌ పాత వెర్షన్‌ ఉపయోగిస్తున్నా.. ‘వెయిటింగ్‌ ఫర్‌ దిస్‌ మెసేజ్‌.. చెక్‌ యువర్‌ ఫోన్‌’ అని చూపిస్తుందని వాట్సప్‌ చెబుతోంది. ఒకవేళ మీరు వెబ్‌ వాట్సప్‌ కనెక్ట్ చేసినప్పుడు.. ఫోన్‌ దానితో సింక్‌ కాకపోయినా ఈ ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుంది.

టెక్‌ నిపుణులు మాత్రం ఈ ఎర్రర్‌ వెనుక అసలు కారణం వివరించారు. వాట్సప్‌లో జరిగే సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉంటుంది. దీని వల్ల ఇద్దరి మధ్య చాట్‌లను మూడో వ్యక్తి చూడలేరు. అలా ప్రతి చాట్‌కి ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కోసం వాట్సప్‌ కొన్నిసెక్యూరిటీ కీలను ఉపయోగిస్తుంది.

యూజర్లు ఎవరైనా వాట్సప్‌ను అన్‌-ఇన్‌స్టాల్ చేసి రీ-ఇన్‌స్టాల్‌ చేసినా, లేదా కొత్త ఫోన్‌లో వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు.. ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ కోసం సెక్యూరిటీ కీలను జనరేట్‌ చేసేందుకు వాట్సప్‌కు కొంత సమయం పడుతుంది. ఆ సమయంలోనే ‘వెయిటింగ్‌ ఫర్‌ దిస్‌ మెసేజ్‌.. చెక్‌ యువర్‌ ఫోన్‌’ అని కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే, భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా.. వాట్సప్‌ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడమే మేలని టెక్నికల్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: తరగతి గదిలోనే విద్యార్థులతో ఇలాంటి డాన్సులేంటి..? ఓ టీచర్‌పై తల్లిదండ్రుల ఆగ్రహం.. దెబ్బకు ఉద్యోగం ఊస్ట్..!

Updated Date - 2023-05-16T16:10:35+05:30 IST