Tea: వామ్మో.. ఇదెక్కడి టీ.. ఇది తాగితే నరకానికి వెళతారట.. వైరల్ అవుతున్న ఫిష్ టీ!
ABN , First Publish Date - 2023-10-15T18:23:16+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు టీ లేదా కాఫీతో తమ దినచర్యను ప్రారంభిస్తారు. చాలా మంది ప్రజలు టీ అంటే ప్రాణం పెడతారు. టీ సిప్ చేస్తేనే వారు రిలాక్స్ అయినట్టు భావిస్తారు. టీ ప్రియుల కోసం ఎన్నో రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు టీ (Tea) లేదా కాఫీ (Coffee)తో తమ దినచర్యను ప్రారంభిస్తారు. చాలా మంది ప్రజలు టీ అంటే ప్రాణం పెడతారు. టీ సిప్ చేస్తేనే వారు రిలాక్స్ అయినట్టు భావిస్తారు. టీ ప్రియుల (Tea Lovers) కోసం ఎన్నో రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. హెర్బల్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్ టీ, పుదీనా టీ వంటి ఆరోగ్యకర టీలు కూడా దొరుకుతున్నాయి. టీ ప్రియులను ఆకట్టుకునేందుకు రోజు రోజుకూ కొత్త రకాల ఛాయ్‌లు పుట్టుకొస్తున్నాయి. బెంగాల్‌కు చెందిన ఓ మహిళ తాజాగా ఫిష్ టీ (Fish Tea) తయారు చేసింది.
SOUVIK అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో మహిళ చేపతో టీ తయారు చేసింది. మరుగుతున్న టీలో ఆ మహిళ చేప (Fish) ముక్కను వేసి బాగా కలిపింది. అనంతరం దానిని వడ కట్టి గ్లాస్‌లో వేసింది. అనంతరం ఓ పుల్లకు చేపను గుచ్చి ఆ టీ గ్లాస్‌లో ఉంచింది. ఈ టీ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 60 వేల మంది వీక్షించారు. ఈ టీపై కామెంట్లు చేస్తున్నారు.
Shocking Video: జలపాతం దగ్గర నవ్వుతూ ఆటలు.. అంతలో జరిగిందొక ఘోరం.. కళ్ల ముందే ఓ వ్యక్తి మాయం...
``దేవుడా.. ఈ టీ తాగిన వారు నరకానికి పోతారు``, ``ఈ టీ తాగిన, తయారు చేసిన వారి కోసం గరుడ పురాణంలో ప్రత్యేకంగా శిక్షలు ఉన్నాయి``, ``మీకు టీ అంటే ఇష్టముంటే ఈ వీడియో చూడకండి``, ``ఈ వీడియో చూశాక బెంగాలీలంటే అసహ్యమేస్తోంది``, ``ఒక టీ లవర్‌గా చెబుతున్నా.. వీరికి ఉరిశిక్ష విధించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.