Funny Video: చేతిమీద ముద్దు పెట్టి మరీ సారీ చెప్పినా అస్సలు కోపం తగ్గదంట.. నెట్టింట్లో వైరల్ అవుతున్న కంగారూల లవ్ స్టోరీ..
ABN , First Publish Date - 2023-04-30T16:47:10+05:30 IST
జీవిత భాగస్వామి అలిగితే సామి.. సామి.. అని బతిమాలుకోవడానికి జంతువులు కూడా సిద్దంగా ఉంటాయట. ఈ కంగారు జంటను చూస్తే..
భర్తకు భార్యమీద కోపం వచ్చిన్పపుడు భర్తను కూల్ చేయడానికి భార్యలు పడరాని కష్టాలు పడతారు. భర్తకు నచ్చిన వంట చేయడం, అతనికి నచ్చినట్టు తయారవ్వడం, పదే పదే మాట్లాడటానికి ప్రయత్నం చేయడం ఇలా చాలా చేస్తారు. కానీ మిషన్ సక్సెస్ కాలేదనుకోండి ఇక నేరుగా బతిమాలడమో లేదా ముద్దులు పెట్టి, హగ్గులిచ్చి వాళ్లను కూల్ చేయడమో చేస్తుంటారు. ఇదంతా కేవలం మనుషుల మధ్యనే కాదు.. జంతువుల మధ్య కూడా ఉంటుంది. కానీ అది మనుషుల కంట పడటం చాలా అరుదు. జీవిత భాగస్వామి అలిగితే సామి.. సామి.. అని బతిమాలుకోవడానికి జంతువులు కూడా సిద్దంగా ఉంటాయట. ఈ కంగారు జంటను చూస్తే ఇదంతా నిజమేనని అర్థమవుతుంది. తన మీద కోప్పడిన మగ కంగారూను కూల్ చేయడానికి ఆడ కంగారు చేస్తున్న పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
మనుషుల్లాగే జంతువులు కూడా ప్రేమగా ఉంటాయి, కోపం వస్తే కోపాన్ని ప్రదర్శిస్తాయి, అలుగుతాయి. వీడియోలో ఓ కంగారు జంట(kangaroo couple) కనిపిస్తుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ మగ కంగారుకు(buck) ఆడ కంగారు(doe) మీద చెప్పరాని కోపం వచ్చింది. 'నువ్వు తప్పు చేశావ్..నిన్ను క్షమించేది లేదు' అనే రేంజ్ లో ముఖమంతా కందగడ్డ చేసుకుని, గంభీరంగా నిలబడుకుని ఉందది. ఆడ కంగారు మగ కంగారు ఎదురుగా నిలబడుకుని 'ఏమండీ.. నన్ను క్షమించండి.. ప్లీజండీ.. మీరు చాలా మంచివారు.. మీది చాలా మంచి మనసు' అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ మగ కంగారు చేతిని తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టింది. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు ముద్దుపెట్టుకుంది. అసలే.. అన్నగారికి కోపం ఎక్కువగా ఉన్నట్టుంది, మళ్లీ మూడోసారి ముద్దుపెట్టుకునే అవకాశం ఇవ్వకూడదని 'నీ నటన నా దగ్గర కాదు.. పో అవతలికి' అన్నట్టు పాపం ఆడ కంగారు చేతిని విదిలించుకుంది. ఆడ కంగారు వెంటనే మగ కంగారు ఛాతీ మీద చెయ్యి పెట్టి 'కూల్ డౌన్.. కూల్ డౌన్.. ఎందుకంతగా బీపీ పెంచుకుంటారు' అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇలా ఉండగానే వీడియో ఎండ్ అయిపోయింది.
Viral Video: ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. ఈ పిల్లాడు చేపలు పట్టే టెక్నిక్ చూస్తే అవాక్కవుతారు..
ఈ వీడియోను Nature is Amazing అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. 'ok he's still angry' 'సరే ఇతను ఉంకా కోపంగానే ఉన్నాడు' అనే క్యాప్షన్ ఈ వీడియోకు జతచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీటి ప్రవర్తనకు ఫిదా అయిపోయారు. 'ఒక జంట కోపంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు.. జంతువులు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయని అర్థమయ్యింది' అని అంటున్నారు. 'జంతువులు కూడా మనలాగే పరిణామ క్రమం చెందుతున్నాయి' అని మరొకరు కామెంట్ చేశారు. 'భార్య, భర్త క్రెడిట్ కార్డ్ మొత్తం ఖాళీ చేసినప్పుడు భర్త సేమ్ ఇలాగే ఉంటాడు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ కంగారుల ప్రేమ భలే ఫన్ పంచుతోంది.