Funny Video: సైకిల్ బాగుందని ఒకరి తర్వాత మరొకరు కొట్టేద్దామని ట్రై చేశారు.. ఎక్కి కూర్చున్న మరుక్షణమే మైండ్బ్లాకయ్యే పరిణామం..
ABN , First Publish Date - 2023-04-02T10:18:42+05:30 IST
లాక్ లేకుండా పార్క్ చేసిన సైకిల్ చూసి దాన్ని కొట్టేద్దామనుకున్నారు కానీ..
రోడ్డుమీద సరదాగా వెళుతూ హస్తవాటం చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళను చూస్తే అసలు దొంగలేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఓ వ్యక్తి తన సైకిల్(bicycle) ను లాక్ చెయ్యకుండా పబ్లిక్ లో పార్క్ చేశాడు. ఇంకేముంది అదేదో ఉచితంగా తీసుకుపోండి అని ఎవరో చెప్పినట్టు.. దారినపోతున్న దానయ్యలు ఆ సైకిల్ ను లేపేద్దామనుకున్నారు. తీరా సైకిల్ ఎక్కాక వారికి పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. తన సైకిల్ ను ఎవరూ దొంగిలించకూడదని సదరు సైకిల్ యజమాని సైకిల్ కు కొన్ని సెట్టింగ్స్ చేశాడు. ఈ కారణంగానే దొంగలు ముప్పు తిప్పలు పడ్డారు. ఓ సైకిల్ ను దొంగిలించడానికి ప్రయత్నించిన దొంగల వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బుద్దిగా కనిపిస్తూనే దొంగతనం చేసే ప్రబుద్దులు ఉంటారు. ఓ వ్యక్తి తన సైకిల్ ను పబ్లిక్ గా పార్క్ చేశాడు. అయితే సైకిల్ కు లాక్ చెయ్యలేదు. దీనికి బదులుగా అతను తన సైకిల్ సీట్(Settings in seat area) భాగంలో చిన్న మార్పు చేశాడు. సైకిల్ సీట్ కింద ఇసుప పైప్ సెట్ చేశాడు. సైకిల్ మీద కూర్చునేటప్పుడు ఆ సెట్టింగ్ ను మార్చుకోవాలి. ఆ విషయం అతనికి మాత్రమే తెలుసు. సైకిల్ కు లాక్ లేకుండా ఉండటం గమనించిన దొంగలు సైకిల్ ను లేపేద్దాం అనుకున్నారు. అత్యుత్సాహంతో సైకిల్ తీసుకెళ్ళిపోదామని అలా సీట్ మీద కూర్చున్నారో లేదో సీట్ కింద ఉన్న ఇనుప పైప్ పైకి పొడుచుకువచ్చింది. సైకిల్ మీద దొంగ అలా కూర్చోగానే పైప్ వేగంగా పైకి పొడుచుకురావడంతో పాపం దొంగకు కింద దద్దరిల్లిపోయింది. బయటకు చెప్పలేనంత నొప్పితో అక్కడి నుండి పలాయనం చిత్తగించాడు.
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు దొంగలు సైకిల్ దొంగతనం చేస్తూ పట్టపగలే చుక్కలు చూశారు. దొంగకు తేలు కుట్టినట్టు అక్కడినుండి ఊడాయించారు. ఈ వీడియోను HumansNoContext అనే ట్విట్టర్ పేజీలో NO CONTEXT HUMANS అనే యూజర్ షేర్ చేశారు. దీన్ని చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 'సైకిల్ దొంగలకు(bicycle thieves) బాగా శాస్తి జరిగింది, ఇలాంటి వాళ్ళు ఉంటారనే సదరు సైకిల్ యజమాని ఇలాంటి జాగ్రత్త తీసుకున్నాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.