Garlic Onion Peel: ఉల్లిపాయలు, వెల్లిపాయల పొట్టును డస్ట్‌బిన్‌లో పారేస్తున్నారా..? ఈ నిజాలు తెలిస్తే జాగ్రత్తగా దాచిపెడతారేమో..!
ABN , First Publish Date - 2023-11-07T09:16:42+05:30 IST
రోజూ చెత్త బుట్టలో వేసే ఉల్లి, వెల్లుల్లి పొట్టును ఇలా ఉపయోగించవచ్చని తెలిస్తే షాకవుతారు.
ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంట చేసుకునేవారు చాలా అరుదని చెప్పొచ్చు. ఇవి వాడకుండా చేస వంట కూడా అంత రుచికరంగా ఉండదు. ప్రతి ఇంట్లో రోజూ ఉల్లి, వెల్లుల్లి తాలూకూ పొట్టు డస్ట్ బిన్ లోకి వెళ్తుంటుంది. అయితే అందరూ చెత్తబుట్టలోకి తోసే ఈ రెండింటి పొట్టుతో కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వైద్యుల వద్దకెళ్ళి వేలు పోసి చికిత్స తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రాని జబ్బులలో ఉల్లి, వెల్లుల్లి పొట్టు మ్యాజిక్ చేస్తుంది. ఉల్లి, వెల్లుల్లిలోనే కాదు, వీటి తొక్కలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, విటమిన్-ఇ, ఫ్లేవనాయిడ్స్ వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. అసలు ఉల్లి, వెల్లుల్లి పొట్టు(Onion, Garlic peel benefits) ఆరోగ్యానికి ఎలా మంచి చేస్తుంది? దీన్ని ఏయే సమస్యలలో ఉపయోగించవచ్చు? వివరంగా తెలుసుకుంటే..
ఇప్పటికాలంలో చాలామంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిలో ఒత్తిడి(stress) ప్రధానమైనది. మానసిక సమస్యలన్నీ ఒత్తిడితోనే మొదలవుతాయి. ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఉల్లి, వెల్లుల్లి తొక్కల టీ(onion, garlic peel tea) చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది.
Read Also: Health Facts: ఆహారం తిన్న వెంటనే మీరూ ఈ పనులు చేస్తారా? ఈ 5 అలవాట్లు ఎంత చెడ్డవో తెలిస్తే..
వాతావరణం క్రమంగా మారుతోంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళల్లో చలి విపరీతంగా ఉంటోంది . చల్లని వాతావరణం వల్ల అంటు వ్యాధుల ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. ఉల్లి, వెల్లుల్లి తొక్కలను నీటిలో వేసి మరిగించి ఈ నీటితో స్నానం చేస్తే ఏ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
చలికాలంలో కండరాలు పట్టుకుపోవడం, కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. సాధారణ రోజులలో కూడా కండరాలు నొప్పిగా ఉన్నప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి తో డికాషన్ తయారుచేసి ఆ డికాషన్ తాగితే కండరాల నొప్పులు(muscle pains) మంత్రించినట్టు తగ్గిపోతాయి.
జుట్టు సంరక్షణలో ఉల్లి, వెల్లుల్లి బాగా వాడుతారని తెలిసిందే. ఉల్లిపాయ రసాన్ని, వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాయడం వల్ల జుట్టు భలే పెరుగుతుంది. అయితే కేవలం వీటి రసమే కాదు ఉల్లి, వెల్లుల్లి పొట్టును కూడా జుట్టు సంరక్షణలో ఉపయోగించవచ్చు. ఉల్లి, వెల్లుల్లి తొక్కలు నీటిలో ఉడికించి ఈ నీటితో తల శుభ్రం చేసుకున్నా, ఈ నీటిని జుట్టుకు స్ప్రే చేసుకుంటూ ఉన్నా జుట్టు ఊహించని విధంగా ఆరోగ్యంగా, ఒత్తుగా(Healthy hair growth) పెరుగుతుంది.