Viral Video: చపాతీలు ఎక్కడయినా ఇంత బాగా పొంగడాన్ని చూశారా..? ఈ మహిళ అందులో ఏం కలిపిందో చూస్తే..!
ABN , First Publish Date - 2023-09-16T17:50:58+05:30 IST
భారతీయ వంటకాలు ఖండాలు దాటి ఇతర దేశస్థులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది విదేశీయులు భారతీయ రుచులకు ఫిదా అవుతున్నారు. మన వంటకాలలోని అద్భుతాలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా చపాతీలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
భారతీయ వంటకాలు (Indian Dishes) ఖండాలు దాటి ఇతర దేశస్థులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది విదేశీయులు భారతీయ రుచులకు ఫిదా అవుతున్నారు. మన వంటకాలలోని అద్భుతాలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా చపాతీలు (Chapaties) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. భారతీయ వ్యక్తిని వివాహం చేసుకున్న ఒక జర్మన్ మహిళ భారతీయ వంటకాలతో ప్రయోగాలు చేస్తోంది. ఆ వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చపాతీలు పొంగేలా ఆమె ఉపయోగించిన ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటుంది (Softer roties).
ఆండ్రియా అనే జర్మన్ మహిళ (German Woman) ఒక ప్రత్యేక పదార్థాన్ని జోడించి చపాతీలను అద్భుతంగా చేసింది. ఆమె వేసిన పదార్థం వల్ల చపాతీలు పొంగడమే కాకుండా చాలా సుతిమెత్తగా మారిపోయాయి. @we_coffeemilkfamily అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. రోటీని మెత్తగా చేయడానికి ఆమె అవకాడో (Avocado) జోడించింది. రోటీకి అవకాడో జోడించడం ద్వారా వాటిని సుతిమెత్తగా మార్చే ప్రక్రియ చాలా మందిని ఆకట్టుకుంటోంది. చాలా మంది ఛెఫ్‌లకు కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది.
Viral News: 10 రోజులపాటు సెలవు కావాలంటూ బాస్‌కు మెసేజ్.. 2 నిమిషాల్లో ఓకే అంటూ మెసేజ్.. నెటిజన్ల డౌట్ ఏంటంటే..!
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అయింది. 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోలోని మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``రోటీ పిండికి బచ్చలి కూర కలిపినా కూడా మెత్తగా ఉంటాయి``, ``మంచి రెసిపీ``, ``ఆరోగ్యానికి కూడా మంచిది``, ``నేను కూడా ఇలాగే తయారు చేస్తాను. మా పిల్లలు బాగా ఇష్టపడతారు`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.