Viral Video: ఛీ.. అలా ఎలా తింటున్నావమ్మా? టమాటా చట్నీతో బొద్దింకలను తింటున్న యువతి.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-08-15T13:40:15+05:30 IST

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ఈ విశాల ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒకరి ఆహారపు అలవాట్లు మరొకరికి ఎబ్బెట్టుగా ఉంటాయి. మనదేశంలో మాంసాహారులు చికెన్, మటన్, చేపలు ఎక్కువగా తింటారు. కొద్ది మంది పంది మాంసం, గొడ్డు మాంసం కూడా తింటారు.

Viral Video: ఛీ.. అలా ఎలా తింటున్నావమ్మా? టమాటా చట్నీతో బొద్దింకలను తింటున్న యువతి.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ఈ విశాల ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒకరి ఆహారపు అలవాట్లు మరొకరికి ఎబ్బెట్టుగా ఉంటాయి. మనదేశంలో మాంసాహారులు చికెన్, మటన్, చేపలు ఎక్కువగా తింటారు. కొద్ది మంది పంది మాంసం, గొడ్డు మాంసం కూడా తింటారు. అయితే చైనా (China) వంటి దేశాల్లో పాములు, తేళ్లు, కీటకాలను వండుకుని తింటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో యువతి బొద్దింక (Cockroach)ను చట్నీలో నంజుకుని తింటోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒకమ్మాయి బొద్దింకలను నూనెలో వేయిస్తోంది. అనంతరం రెండు, మూడు బొద్దింకలను టమాటా (Tomato), మిర్చి చట్నీతో కలిపి తింటోంది (Girl eating cockroach). ఆ వీడియో చూస్తే చాలా మందికి వికారమైన అనుభూతి కలుగుతుంది. infavoritewild అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఐదు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు (Viral Video).

Man kisses Cobra: వీడేంటి ఇలా ఉన్నాడు.. అత్యంత విషపూరిత పాముకు ముద్దు పెట్టాడు.. ఆ పాము రియాక్షన్ ఏంటంటే..

ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``చైనా వాళ్లకు ఆకలి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వాళ్లు ఏదైనా తినేస్తారు``, ``మా ఇంట్లో చాలా బొద్దింకలు ఉన్నాయి. వచ్చి వాటిని ఉచితంగా తీసుకెళ్లండి``, ``బొద్దింకలు చాలా మురికి జీవులు. వాటిని ఎలా తింటున్నారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-15T15:41:30+05:30 IST