Viral Video: ఎందుకొచ్చిన కడుపుమంట తల్లీ.. ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తూ ఈ నిర్వాకమేంటి..? పక్కనే ఓ కుర్రాడు బైక్‌పై వెళ్తోంటే..
ABN , First Publish Date - 2023-06-05T15:08:13+05:30 IST
మనుషులకు ఉండే అనేక రకాల అవలక్షణాల్లో అసూయ కూడా ఒకటి. నిజానికి ఏ వ్యక్తిలో అయితే మితిమీరిన అసూయ, కోపం, ద్వేషం ఉంటాయో అవి అతడికే ప్రమాదం కలిగిస్తాయి. అతడి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఒకరికి చెడు చేయాలనుకుంటే ముందు మనకే ప్రమాదం వాటిల్లుతుంది.
మనుషులకు ఉండే అనేక రకాల అవలక్షణాల్లో అసూయ (Jealousy) కూడా ఒకటి. నిజానికి ఏ వ్యక్తిలో అయితే మితిమీరిన అసూయ, కోపం, ద్వేషం ఉంటాయో అవి అతడికే ప్రమాదం కలిగిస్తాయి. అతడి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఒకరికి చెడు చేయాలనుకుంటే ముందు మనకే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఒక అమ్మాయి వేరే యువతికి హాని కలుగచేయాలని ప్రయత్నించి తానే ప్రమాదానికి గురైంది.
yash_editz అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి ఓ యువకుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తోంది. ఆ సమయంలో మరో యువతి వారి పక్క నుంచే బైక్‌పై వెళ్తోంది. ఏమైందో ఏమో మొదటి యువతి హఠాత్తుగా లేచి బైక్‌పై వెళ్తున్న యువతిని కాలితో తన్నేందుకు ప్రయత్నించింది (Girl kicks another girl on bike). అయితే ఆమె కాలు బైక్‌కు తగిలి బ్యాలెన్స్ కోల్పోయింది.
Viral Video: నడిరోడ్డుపై మహిళా కానిస్టేబుల్‌కు ముద్దు పెట్టిన యువకుడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
వెంటనే బైక్‌పై నుంచి కింద పడిపోయింది. వెనుక వస్తున్న కారు డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మొత్తాన్ని కారులో వస్తున్న వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పటివరకు 2.25 లక్షల లైకులు దక్కించుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇతరుల వెనుక గోతులు తవ్వే వారి గతి ఇదే``, ``ఇన్‌స్టంట్ కర్మ అంటే ఇదే``, ``ఇతరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే ఇంతే..`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.