పది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువతి.. ఏడాది తిరగక ముందే ఆమె భర్త పరిస్థితి ఏమైందంటే..
ABN , First Publish Date - 2023-03-14T16:47:55+05:30 IST
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్నా కొందరి ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. కుల వివక్ష తొలగిపోవడం లేదు. పరువు హత్యలు ఆగడం లేదు.
దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెంది ముందుకు దూసుకుపోతున్నా కొందరి ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. కుల వివక్ష (Caste Discrimination) తొలగిపోవడం లేదు. పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ యువకుడు తన సోదరిని కులాంతర వివాహం చేసుకున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. తాను మారపోయినట్టు నమ్మించి సోదరి ఇంట్లో మూడ్రోజులు ఉండి అదును చూసి బావను హత్య చేసి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు (Crime News).
రాజస్థాన్‌లోని ధౌల్పూర్కు చెందిన రాజ్ (25) అనే వ్యక్తి 10 నెలల క్రితం ఆగ్రాలోని తాతంపూర్కు చెందిన రమ (23) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు రమ కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించినా వారు అంగీకరించలేదు. అయినప్పటికీ రాజ్, రమ పెళ్లి (Love Marriage) చేసుకున్నారు. వివాహం తర్వాత, రాజ్ తన భార్య రమతో కలిసి రోహతాలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం రమ గర్భవతి. ఈ నెలలోనే ఆమె డెలివరీ జరగనుంది. ఈ నేపథ్యంలో రమ సోదరుడు శివశంకర్ తిరిగి అక్కకు దగ్గర కావడానికి ప్రయత్నించాడు.
Viral Video: హాస్పిటల్లో ఫోన్ మాట్లాడుతున్న యువతి.. ఇంతలో ఓ వ్యక్తి గోడ దూకి వచ్చి ముద్దు పెట్టేశాడు.. వైరల్ అవుతున్న వీడియో
అంతా మర్చిపోయినట్టు నటించి ఆమె ఇంటికి వెళ్లాడు. మూడ్రోజులుగా అక్కడే ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న రాజ్‌పై తుపాకీతో (Gun Firing) రెండు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయాడు. బుల్లెట్ శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఆ ఇంటికి చేరుకుని రాజ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజ్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భర్త మరణ వార్త విన్న భార్య ఆరోగ్యం క్షీణించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.