గాళ్‌ఫ్రెండ్‌పై అనుమానం.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చెక్ చేసి షాక్.. ఆ మైనర్ బాలుడు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2023-03-11T19:49:42+05:30 IST

ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ప్రేమ మత్తులో ఎంతో మంది ఘాతుకాలకు పాల్పడుతున్నారు.

గాళ్‌ఫ్రెండ్‌పై అనుమానం.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చెక్ చేసి షాక్.. ఆ మైనర్ బాలుడు ఎంత పని చేశాడంటే..

ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ప్రేమ మత్తులో ఎంతో మంది ఘాతుకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బాలుడు తన ప్రేయసిపై అనుమానం పెంచుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఝార్ఖండ్‌లోని (Jharkhand) గోదా జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటన సంచలనం సృష్టించింది (Crime News).

గోదా జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడు తనతో కలిసి చదువుతున్న బాలికతో ప్రేమాయాణం సాగిస్తున్నాడు. ఆ బాలిక కూడా ఆ కుర్రాడితో చనువుగా ఉండేది. అయితే కొంతకాలంగా ఆ యువతి మరో బాలుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛాటింగ్ చేసేది. ఆ విషయం ప్రియుడి దృష్టికి వచ్చింది. ఈ విషయమై హోలీ రోజున ప్రేయసితో ఆ బాలుడు గొడవపడ్డాడు. చివరకు ఓ ఇనుప రాడ్డుతో ప్రేయసి తలపై కొట్టి ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు (Boy Friend killed Girl Friend).

Old Couple Drinking: ఆహా.. మందేస్తూ ఎంజాయ్ చేస్తున్న వృద్ధ జంట.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం పోలీసులకు ఆ బాలిక మృతదేహం దొరికింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులకు ఆమె ప్రియుడి గురించి తెలిసింది. ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది.

Updated Date - 2023-03-11T19:49:42+05:30 IST