Viral Video: వామ్మో.. ఈ మేక ధైర్యం మామూలుగా లేదు.. రైనోలకే ఎలా చుక్కలు చూపిస్తుందో చూడండి..!

ABN , First Publish Date - 2023-08-29T10:07:12+05:30 IST

సాధారణంగా మేకలు సాధు జంతువులు. వేరే జంతువుల జోలికి వెళ్లవు. అయితే గ్రామాల్లో అప్పుడప్పుడు కుక్కలతోనే కాదు గేదెలతో కూడా యుద్ధానికి దిగుతాయి. వాడి కొమ్ములతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో మేక ఏకంగా రైనోలతోనే యుద్ధానికి దిగింది.

Viral Video: వామ్మో.. ఈ మేక ధైర్యం మామూలుగా లేదు.. రైనోలకే ఎలా చుక్కలు చూపిస్తుందో చూడండి..!

సాధారణంగా మేకలు (Goats) సాధు జంతువులు. వేరే జంతువుల జోలికి వెళ్లవు. అయితే గ్రామాల్లో అప్పుడప్పుడు కుక్కలతోనే కాదు గేదెలతో కూడా యుద్ధానికి దిగుతాయి. వాడి కొమ్ములతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో మేక ఏకంగా రైనోలతోనే యుద్ధానికి దిగింది. అంతేకాదు ఆ రైనోలను భయపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది (Goat locking horns with Rhinos).

IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మేక జూ ఎన్‌క్లోజర్‌లో ఉన్న అనేక ఖడ్గమృగాలతో పోరాడుతోంది. ముందు ఓ ఖడ్గ మృగం మేకను తన తలతో ఢీకొట్టింది. ఆగ్రహానికి గురైన మేక ఆ ఖడ్గ మృగాన్ని తన వాడి కొమ్ములతో ఢీకొట్టింది. దీంతో ఆ ఖడ్గ మృగం పారిపోయింది. తర్వాత అక్కడకు వచ్చిన మరో రెండు ఖడ్గ మృగాలకు కూడా మేక చుక్కలు చూపించింది. వాటిని తన కొమ్ములతో ఢీకొంటూ వెనక్కి వెనక్కి నెట్టేసింది. మేకకు ఖడ్గ మృగాలు భయపడడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడితో యాంకర్ అసభ్య ప్రవర్తన.. పక్కనే కూర్చున్న వధువు రియాక్షన్ చూడండి..

``చాలా మోటివేషనల్ స్పీచ్‌లు విన్న తర్వాత`` అంటూ ఈ వీడియోకు సుశాంత నంద క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 24 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ మేకకు చాలా ధైర్యం ఎక్కువ. ఒకేసారి మూడు రైనోలను చూసినా భయపడలేదు``, ``ఈ మేక ధైర్యం చాలా మందికి స్ఫూర్తి`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-29T10:07:12+05:30 IST