పెళ్లి రోజు వరుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వధువు.. చివరి నిమిషంలో షాకిచ్చిన వరుడి తండ్రి.. ఏం చేయాలో తెలియక..
ABN , First Publish Date - 2023-03-15T16:14:52+05:30 IST
ఆ యువతికి వివాహం నిశ్చయమైంది.. తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేశారు.. పెళ్లి రోజు ఉదయం బంధుమిత్రులతో కలిసి వధువు కల్యాణ మండపానికి చేరుకుంది..
ఆ యువతికి వివాహం నిశ్చయమైంది.. తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేశారు.. పెళ్లి రోజు ఉదయం బంధుమిత్రులతో కలిసి వధువు (Bride) కల్యాణ మండపానికి చేరుకుంది.. అయితే ముహూర్తం సమయం దాటి పోతున్నా వరుడి (Groom) తరఫు వారు కల్యాణ మండపానికి చేరుకోలేదు.. దీంతో వధువు తండ్రి వారికి ఫోన్ చేశాడు.. అవతలి వారు చెప్పింది విని షాకై కన్నీరు పెట్టుకున్నాడు.. ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) దాటియా గ్రామానికి చెందిన రణేంద్ర అనే యువకుడికి రాజోరియా గ్రామానికి చెందిన భగవాన్దాస్ కూతురితో మంగళవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. కూతురి పెళ్లి కోసం భగవాన్దాస్ చాలా ఖర్చు చేశాడు. రూ.7 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి రోజు ఉదయం వధువు తరఫు వారు కల్యాణ మండపానికి చేరుకున్నారు. వరుడి తరఫు వారు ఇంకా రాకపోవడంతో వారికి భగనవాన్ దాస్ ఫోన్ చేశాడు. తమకు ఇప్పటికిప్పుడు ఒక కారు, మరో ఐదు లక్షలు అదనపు కట్నం ఇస్తే తప్ప కల్యాణ మండపానికి వచ్చేది లేదని రణేంద్ర తండ్రి తేల్చి చెప్పాడు (Dowry Harassment).
పొట్టి దుస్తులు ధరించి బయటకు వెళ్లిందని భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత చెప్పినా వినకపోవడంతో ఏం చేశాడంటే..
వరుడి తండ్రి చెప్పింది విని భగవాన్దాస్ షాకయ్యాడు. అప్పటికప్పుడు వారి కోరికలు తీర్చేంత డబ్బు అతని వద్ద లేదు. ఆ విషయమే చెప్పి వరుడి తండ్రిని బతిమాలాడు. అయితే తాము అడిగింది ఇవ్వకపోతే పెళ్లి రద్దైనట్టేనని వరుడి తండ్రి స్పష్టం చేశాడు. నిజానికి వరుడు అడిగిన కట్నం డబ్బులను భగవాన్దాస్ ముందుగానే ఇచ్చేశాడు. అది సరిపోదని, తమకు ఇంకా డబ్బులు కావాలని కోరడంతో భగవాన్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.