Share News

Viral Video: పెళ్లి వేదిక మీద ముద్దు పెట్టబోయిన వరుడు.. నిరాకరించిన వధువు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 19 , 2023 | 01:26 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి వేడుకల్లో జరిగిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Viral Video: పెళ్లి వేదిక మీద ముద్దు పెట్టబోయిన వరుడు.. నిరాకరించిన వధువు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది. పెళ్లి వేడుకల్లో జరిగిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Videos) అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా పెళ్లి వేడుకలో అందరి కళ్లూ వధూవరుల మీదే ఉంటాయి. వధూవరులు దండలు మార్చుకునే సమయంలో బంధు మిత్రులందరూ కెమేరాలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. తాజాగా జరిగిన ఓ పెళ్లిలో వధూవరుల మధ్య జరిగిన చిరు పోట్లాట చాలా మందిని ఆకట్టుకుంటోంది (Wedding Videos).

@ChapraZila అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు పెళ్లి వేదిక మీద నిల్చుని దండలు మార్చుకుంటున్నారు. వరుడి (Groom) మెడలో వధువు (Bride) దండ వేసింది. ఆ సమమయంలో వధువుకు వరుడు ముద్దు పెట్టాలనుకున్నాడు. ఆ విషయం ఆమె చెవిలో చెప్పాడు. అందుకు వధువు నిరాకరించింది. దీంతో అతడు వధువు మెడలో దండ వేయలేదు. దీంతో వధువు చివరకు ముద్దుకు అంగీకరించింది. దాంతో వధువు బుగ్గపై వరుడు ముద్దు పెట్టి మెడలో దండ వేశాడు.

Interesting Video: మనం వాడే రబ్బర్ బ్యాండ్‌లను ఎలా తయారు చేస్తారో తెలుసా? సీక్రెట్ రివీల్ చేసిన వైరల్ వీడియో!

ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 83 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``వరుడు అతిగా ప్రవర్తించాడు``, ``వెస్ట్రన్ కల్చర్ మన సాంప్రదాయాలను నాశనం చేస్తోంది``, ``వధువు వద్దన్నప్పుడు మానెయ్యాల్సింది``, ``ఇది మన సంస్కృతి కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 19 , 2023 | 01:26 PM