Marriage: ఫ్రెండ్ కదా అని పెళ్లికి పిలిస్తే.. చేసేది ఇలాంటి పనా..? అంతా పెళ్లి పనుల్లో ఉంటే అతడు చేసిన పనేంటో సీసీ కెమెరాలో చూసి..

ABN , First Publish Date - 2023-05-03T15:04:32+05:30 IST

ఆ యువకుడికి పెళ్లి కుదిరింది.. పెళ్లికి రావాల్సిందిగా తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు.. తన ప్రాణ స్నేహితుడిని ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు.. పెళ్లి రోజు అందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.. అయితే ముహూర్త సమయానికి చూసుకుంటే పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బంగారు నగలు కనిపించకుండా పోయాయి..

Marriage: ఫ్రెండ్ కదా అని పెళ్లికి పిలిస్తే.. చేసేది ఇలాంటి పనా..? అంతా పెళ్లి పనుల్లో ఉంటే అతడు చేసిన పనేంటో సీసీ కెమెరాలో చూసి..

ఆ యువకుడికి పెళ్లి (Marriage) కుదిరింది.. పెళ్లికి రావాల్సిందిగా తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు.. తన ప్రాణ స్నేహితుడిని ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు.. పెళ్లి రోజు అందరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.. అయితే ముహూర్త సమయానికి చూసుకుంటే పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన బంగారు (Gold) నగలు కనిపించకుండా పోయాయి.. ఎంత వెతికినా దొరకలేదు.. దీంతో కల్యాణ మండపంలో అమర్చిన సీసీటీవీ (CCTV Footage)కెమేరాలో చూస్తే అసలు విషయం బయటపడింది. ఆ ప్రాణ స్నేహితుడే ఆ నగలు కాజేసినట్టు తేలింది.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బాలాజీ నగర్‌కు చెందిన విశాల్ శర్మ అనే యువకుడికి శివానీతో సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆ వివాహానికి విశాల్ తన స్నేహితులందరినీ పిలిచాడు. తన ప్రాణ స్నేహితుడు అభిషేక్ యాదవ్‌ను కూడా ఆహ్వానించాడు. పెళ్లిలో వధువకు ఇచ్చేందుకు విశాల్ రూ.8 లక్షల విలువైన నగలు కొని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న అభిషేక్ యాదవ్ చాకచక్యంగా ఆ నగలు కొట్టేశాడు. ముహూర్తం సమయానికి నగలు ఇచ్చేందుకు బాక్స్ తెరిచి చూడగా అందులో నగలు కనిపించలేదు.

Viral Video: ఒంటికాలితో ఓ స్టిక్ సాయంతో రోడ్డు దాటుతున్న బాలిక.. కాలినొప్పితో సడన్‌గా నడిరోడ్డుపై ఆగిపోయిన మరుక్షణమే షాకింగ్ సీన్..!

ఆ నగల కోసం వరుడి తరఫు వారు, స్నేహితులు మొత్తమంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. చివరకు కల్యాణ మండపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఆ బాక్స్‌లో నుంచి అభిషేక్ నగలు తీసినట్టు స్పష్టమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు (Crime News).

Updated Date - 2023-05-03T15:04:32+05:30 IST